వావ్... ఇంటర్నెట్ లేకుండా వాట్సప్
posted on Jul 13, 2016 @ 1:08PM
ఇంటర్నెట్ లేకుండా వాట్సప్.. వావ్ వాట్ ఏ బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా.. ఇంకేముంది వాట్సప్ యూజర్లకి ఈ విషయం తెలిస్తే ఎగిరిగంతేస్తారు. అయితే ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ ఉపయోగించాలంటే దానికో చిట్కా వాడాల్సిందే. అదేంటంటే.. మీరు మెసేజ్ పంపించాలని కోరుకొనేవారికి కనెక్ట్ అయిన సిమ్‌ను ఉపయోగించడమే. అయితే అది ఎలా అనుకుంటున్నారా.. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. చాట్‌సిమ్.కామ్ వెబ్‌సైట్‌కి లాగాన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు. దీని ఖరీదు చాట్ సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు భరించాలి. ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ అంటే వినడానికి బానే ఉంది కానీ.. దాని కోసం ఇంత ప్రాసెస్ చేయాలంటే కష్టంగానే ఉంది కదా...