రేవంత్.. ఇప్పుడెలా?
posted on Oct 7, 2022 @ 1:08PM
కొత్తదనాన్నే అందరూ కోరుకుంటారు. సైకిలయినా, కారయినా సరే. పిల్లడికి కొత్త బ్యాగ్ ఇష్టం, పై చదువు లకు వెళ్లే కుర్రాడికి మంచి కాలేజీ కొత్త వాతావరణం కోరుకుంటాడు. ఎన్నాళ్లుబోయినా ఒకే ఇంట్లో ఉం డాలా అని బోరింగ్ గా అనుకునేవారు కొత్త ఇల్లు కొనడానికి వేటలో ఉంటారు. పాత తరం ఆలోచనలు వది లి అందరూ వెళ్లే ఈ తరం దారిలోకి వెళ్లాలని చాలామంది ఉన్నదారిని వదులుకోను యిష్టపడ తారు. ఇపుడు కాంగ్రెస్ నుంచి చాలామంది మళ్లీ టీఆర్ ఎస్ కారు వెళుతోన్న మార్గాన్ని ఎంచుకుం టున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ ఎస్ పార్టీకి బీఆర్ ఎస్ అనే కొత్త పేరు పెట్టుకున్నారు. దాంతోనే ఇక రాజకీయాల్లో దూసుకుపోవాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ వీరాభిమానులను సమాయత్తం చేశారు. మనం దేశ రాజకీయాల్లోనూ హల్‌చల్ చేయాలన్న ప్రబోధ చేసి ఉరకలు పెట్టిస్తున్నారు. టీఆర్ ఎస్‌గా కంటే బీఆర్ ఎస్‌గానే ఉత్తరాది ప్రాంతా ల్లోకి వెళ్లడానికి వీలవు తుందని కేసీఆర్ నమ్ముతున్నారు. పార్టీ పేరు, గుర్తుకీ ఎన్నికల కమిషన్ ఓకే అనేస్తే ఇక మును గోడు ఉప ఎన్నికల నుంచే వీరావేశంలో దూసుకుపోవడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ తన పార్టీ మార్చి దేశంలో తన పార్టీ ప్రభావాన్ని చూపడానికి యువతను కూడా ఎంతో ఆకట్టు కుంటున్నారు. ఆయన వాడి వేడి గమ నించి కాంగ్రెస్‌లోంచి కొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధ పడ్డారు. చిత్రమేమంటే వీరంతా గతంలో టీ ఆర్ ఎస్ నుంచీ ఇటు వచ్చినవారే!
పాతతరం పాలనలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ని యువతతో నింపి ముందుగు వేగంగా వేయించాలని తెలం గాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యువతను ఎంతో ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసి చాల మందిని పార్టీలోకి తీసుకురాగలిగారు. టీఆర్ ఎస్ నాయకులు, అధినేత వ్యవహరిస్తున్న తీరుతో విసిగెత్తిన కొందరు మూటాముల్లూ సద్దుకుని కాంగ్రెస్ పంచన చేరారు. రేవంత్ ఘన విజయం సాధించినంత ఆనం దించా రు. కేసీఆర్ కి గొప్ప ఝలక్ ఇచ్చానని లోలోపల తెగ ఆనందించారు. కానీ అది కేవలం తాత్కాలిక మేనని ఇపుడు స్పష్టమయింది. కదల్లేని కాంగ్రెస్‌లో ఉండేకంటే ఢిల్లీ దాకా ఉరకలు వేయబోతున్న టీ ఆర్ ఎస్ లోకి మళ్లీ వెళ్లడమే మేలు అని బాగా ఆలోచించే వారంతా మళ్లీ ఈ గట్టుకే వచ్చే ఆలోచనలో పడ్డారు. ఈ జంపింగ్ జిలానీలలో రేవంత్ ఇపుడు కంగారపడుతున్నట్టు తెలుస్తోంది. తను ఎంతో ప్రతిష్టగా భావించి ప్రచారం చేసుకున్నదంతా కేవలం డొల్లేనని అధిష్టానానికి ఎగస్పార్టీవారు తెలియజేస్తే, గతేంగాను.
అసలే రాహుల్‌గాంధీ భారత్ జోడో అంటూ యువతను ఆకట్టుకునే ప్రచార యాత్రలో ఉన్నారు. ఈ సంగతి క్లియర్గా తేలితే, తెలిస్తే తిట్టే తిట్లు హిందీలోనూ తెలంగాణా వారికి అర్ధమవుతాయి. మరి అంతటి అవమానం దాటేసేందుకు రేవంత్ మరో అమాయక బృందాన్ని తన గట్టుమీదకి తెచ్చుకోవడానికి వెతుక్కో వాలేమో!