బీజేపీలో నల్లారి ఏం చేస్తున్నారు?
posted on May 6, 2023 @ 12:42PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. చేరి కూడా చాలా రోజులే అయ్యింది. ఆయతే ఆ చేరిక ప్రభావం బీజేపీలో ఏమీ కనిపించడం లేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలం అయ్యింది కూడా లేదు. ఆయన రాష్ట్ర విబజన ను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని స్దాపించి 2004 ఎన్నికలలో పోటీ చేశారు.
అయితే ఆ ఎన్నికలలో ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది. అపపటి నుంచీ ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని కొద్ది కాలం పాటు ఆ పార్టీలో నామ మాత్రంగా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో గత నెల 7న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి నల్లారి చాలా కాలంగా అంటే 2014 ఎన్నికల తరువాత నుంచీ దాదాపుగా ప్రజాజీవితంలో లేరు. అలాంటి నల్లారి చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఏం లాభం, ప్రయోజనం ఉంటుందన్న అనుమానాలు ఆయన చేరిక సమయంలోనే వ్యక్తమయ్యాయి.
చేరిక సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై ఒకటి రెండు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు. బహుశా బీజేపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా పరిశీలకులు భావించారు. నల్లారి చేరికతో తెలుగురాష్ట్రాలలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయనకు పార్టీ కండువా కప్పుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్లారి బీజేపీ తీర్థం పుచ్చుకుని అప్పుడే నెల రోజులు దాటిపోయింది. ఉభయ రాష్ట్రాలలోనూ తనకు రాజకీయ నేతలు పలువురు మంచి మిత్రులనీ, వారందరినీ కమలం గూటికి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని నల్లారి కాషాయ కండువా కప్పుకుంటున్న సందర్భంగా చెప్పారు. కానీ ఈ నెల రోజులలో ఆయన బీజేపీ కోసం ఏం చేశారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమాలేవీ అంటే నిస్సందేహంగా ఏమీ లేవు అన్న సమాధానమే వస్తుంది.