సెప్టెంబర్ 17ని ఏంచేయదలచుకున్నారు?
posted on Sep 15, 2022 @ 1:28PM
చిన్నప్పుడు గాంధీ జయంతి, బాలలదినోత్సవాలు స్కూళ్లల్లో బ్రహ్మాండంగా జరిగేవి. వాటి మధ్య మంచి ఆరోగ్యకర పోటీయే ఉండేది. దూషణభూషణలకు ఆస్కారం ఉండేది కాదు. ఒకే పండుగను వేరు వేరు దృష్టితో నిర్వహించడమే సమాజంలో గొడవలకు, స్పర్ధలకు కారణమవుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొ న్న రాజకీయ వాతావరణంలో బీజేపీవారి భక్తితత్వానికి, ఇతరులు అనుసరించేదానికి ఎంతో తేడా ఉం టోంది. వారు మాట్లాడినది, వారు చేసే పనులు, వారు ప్రకటించేదే అసలు సిసలు దేశభక్తి అని స్వయం గా బీజేపీవారే ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా మారింది.
తాము నిర్వహించేదానికే అత్యంత విలువ ఉంటుందన్న భావన నుంచి బీజేపీవారు బయటపడాలనే అంతా ఆకాంక్షిస్తున్నారు. ఎందు కంటే, దేశభక్తి లో కొట్టుకుపోతున్న సదరు బీజేపీ వారు సెప్టెంబర్ 17ను చరిత్రలో ప్రపంచదేశాలు చెప్పుకునేట్టు చేయ డానికి కంకణం కట్టుకున్నారు.
సెప్టెంబర్ 17.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్న తెలంగాణ సర్కార్..తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతామన్న బీజేపీ చెబు తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లు పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నా యి. సెప్టెంబర్ 17 శనివారం పెరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం సభ నిర్వహించనుంది.
కాగా గురువారం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నుంచి ఆరెంజ్ బ్రిగేడ్ ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరుగుతుంది. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించ నుంది. అమృత మహో త్సవాల్లో భాగంగా పార్టీ తరుపున బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
చిత్రమేమంటే తెలంగాణా ప్రజలు మాత్రం కమలం, కారు వేగాల మధ్య నలిగిపోతున్నారు. తమ ప్రాంత ప్రాధాన్యతను దేశమంతా తెలిసేలా చేయడానికి ఇపుడు అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ కొత్తగా రాజకీ యాల్లోకి వచ్చిన వారికి ఉండే అత్యుత్సాహాన్నే బీజేపీ, టిఆర్ ఎస్ సీనియర్లు ప్రదర్శించడం గమనార్హం. గిస్మంటి రచ్చ బడికిబోయిన్పటి సందీ జూడ్నేలే.. అనుకుంటున్నారు తెలంగాణా ప్రజలు.