అణగారిన వర్గాలకు పెద్ద పీట కర్ణాటక కేబినేట్
posted on May 20, 2023 @ 3:26PM
కర్ణాటక ప్రమాణ స్వీకారోత్సవంలో దళిత ముఖ్యమంత్రి పదవిని నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసింది. ప్రమాణ స్వీకారం రోజు ఎనిమిది మందికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. సింహభాగం అణగారిన వర్గాలేనని తేలిపోయింది. ఈ వర్గాలకు తొలి జాబితాలో నే చోటు దక్కడం విశేషం. వొకలిగ కులానికి ఒక్క స్థానం దక్కకపోవడం విశేషం. ఈ కులం చిత్రదుర్గ , షిమోగో జిల్లాల్లో మాత్రమే కనిపిస్తారు. లింగాయత్ లు బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. బిజెపిని ఓడించిన ప్రజలు లింగాయత్లను కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం చేశారు.లింగాయత్లు హిందూత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. వీళ్లు శివుడుని ఎక్కువగా పూజిస్తారు. హిందూ మతానికి చాలా దగ్గరగా ఉండటంతో బిజెపికి పెద్ద పీట వేశారు. డికె శివకుమార్ డిప్యూటి చీఫ్ మినిస్టర్ పోస్ట్ రావడంతో దళిత కులాలకు డిప్యూటి ముఖ్యమంత్రి పదవి అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. ప్రముఖ దళిత నాయకుడు జి. పరమేశ్వరకు డిప్యూటి పదవి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. తీరా క్యాబినేట్ భేటి రోజు మాత్రం ఆయన ఊసు లేకుండా పోయింది. మొదటి జాబితాలోనే ఆయన పేరు లేకుండా పోయింది. మల్లి ఖార్జున ఖర్గే కుమారుడుకి కూడా కేబినేట్లో చోటు దక్కింది. దళిత కుటుంబానికి చెందిన ఖర్గే ఎ ఐ సిసి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తొలి గాంధీ యేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి దక్కడం గమనార్హం అయితే తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచి ఐటి శాఖా మంత్రి రావడంతో వార్తల్లోకెక్కారు ఖర్గే