వరంగల్ ఉపఎన్నిక.. చంద్రబాబు కోసం టీ బీజేపీ
posted on Nov 13, 2015 @ 10:06AM
బీహార్ ఎన్నికల ఫలితాల వల్ల రాజకీయాల్లో పలు కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో. నిన్న మెున్నటి వరకూ దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. అంతేకాదు వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ముందు ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అవసరమని భావించినా తరువాత మాత్రం జాతీయ స్థాయి నేతలు ఉంటే చాలు ప్రచారానికి చంద్రబాబు అవసరంలేదని భావించారు టీ బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్టయితే ఆ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. వరంగల్ ప్రచారానికి చంద్రబాబు కూడా వస్తేనే ఎమన్న విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిలో భాగంగా టీ బీజేపీ నేతలు చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారట. కనీసం చంద్రబాబు ఒక్కరోజు ప్రచారంలో పాల్గొన్న తమ అభ్యర్ధికి ఎంతో లాభం చేకూరుతుందని భావిస్తున్నారట టీ బీజేపీ నేతలు. అయితే ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ మొత్తం ఖరారైంది. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడమంటే చాలా కష్టమని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.