ఓటర్లతో ఆటాడుకున్న అనంత రెవెన్యూ అధికార్లు?
posted on Jun 14, 2012 @ 10:04AM
ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హులైన ఓటర్లు కూడా అనంత రెవెన్యూ అధికార్ల నిర్లక్ష్యానికి బలయ్యారు. అనంత అర్బన్ శాసనసభ నియోజకవర్గం పరిథిలో పోలింగ్ కేంద్రాలను పెంచారు. దీంతో ఒకే కుటుంబంలోని వారు వేరు వేరు కేంద్రాలకు అదీ కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కొంతమంది ఓటర్లు తిరిగినా ఒట్లెక్కడున్నాయో తెలియక వెనుతిరిగే పరిస్థితులు ఎదురయ్యాయి. అలానే కొన్ని ఓట్లను గల్లంతు కూడా చేసేశారు. ప్రతీసారి ఓటు హక్కు వినియోగించుకునే శ్రీనివాసనగర్ లోని 200 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు గుర్తింపుకార్డు ఉన్నా వీరి పేర్లు ఓటర్ల జాబితాలో లేదు. వేణుగోపాల్ నగర్ లో వండ ఓట్లు కనిపించలేదు. ఎర్రనేలకొట్టాల ఓటర్లు గతంలో రామచంద్రనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేవారు. ఇప్పుడు కమలానగర్ డి.సి.ఎం.హెచ్.ఎస్. కేంద్రానికి వీరి పేర్లు మార్చారు. ఈ విషయం తెలియని ఓటర్లు వెనుదిరిగారు. త్రివేణి కాంప్లెక్స్ ఓటర్లు ప్రతీ ఎన్నికల్లోనూ వేణుగోపాల్ నగర్ లో పోలింగ్ కేంద్రానికి వెళ్ళేవారు. ఈసారి డీపెప్ పాఠశాలకు ఓటర్ల పేర్లు మార్హ్చారు. దీంతో విసుగుచెందిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు.