అభినవ 'అన్నా'కు శృంగభంగం తప్పదా?
posted on Jun 14, 2012 @ 10:36AM
అభినవ అన్నాహజారేకు శృంగభంగమైంది. అసలు అన్నాహజారే కన్నా ఈ అభినవ అన్నా ఓవర్ యాక్షనే చేసేశారు. అది కూడా ఓ పార్టీ అధినేత సృష్టించిన హజారే ఈయన. "అవినీతి ఆరోపణలు ఎదుర్కొనని రాజకీయనేతను మీకు ఇచ్చాను. ఈయన మీ ప్రాంతానికి ఒక అన్నా హజారేలాంటోడు. తానప్ ఇల్లాల విద్యాభ్యాసం నుంచి ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గరిక ఇవచ్చే నిజాయితీపరుడు. ఈయన్ని గెలిపించుకునే బాధ్యత మీదే'' అని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థి, ఐదుసార్లు తాళ్ళరేవు ఎమ్మెల్యేగా గెలుపొందిన చిక్కాల రామచంద్రరావును రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల ముందుంచారు. బాబు మాటలు తలకెక్కిన చిక్కాల అన్నా హజారే స్లోగన్ టో ఉన్న తోపీలతో రామచంద్రాపురం నియోజకవర్గంలో తిరిగారు. తానే అభినవ అన్నా హజారేలా ఫీలయ్యారు. ఎన్నికలు సమీపించే కొద్దీ తనకున్న ఒపికంతా ఉపయోగించి అన్నాహజారేలాంటి చిక్కాలను గెలిపించమని ప్రచారం చేయించారు. మొదటి నుంచి చిక్కాలకు ఉన్న అనుమానమే నిజమైంది. ఈ నియోజకవర్గ ప్రజలు తానేనని చేసినా గెలిపించారని తన సన్నిహితుల ముందు బయటపడిపోయారు. ఈ విషయమూ నియోజకవర్గంలో ఓటర్ల చెవికి సోకింది. ఎలాగూ గెలిపించే పనిలేదు కాబట్టి అన్నాహజారే అంటారేమిటని తెలుగుదేశంపార్టీ కార్యకర్తలను నిలదీయటం మొదలుపెట్టారు.
అక్కడి తెలుగుదేశంపార్టీ పట్టణాధ్యక్షుడు గరికిపాటి సూర్యనారాయణ కూడా తన సామాజిక కమ్మ కులసంఘం సిఫార్లు మేరకు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. తమ సామాజిక కులాలు ఇచ్చిన మద్దతు ప్రకారం ఎక్కువభాగం నేతలు పరోక్షంగా తోట వెనుక చేరారు. ఒక్క రెడ్డి సామాజిక కులం మాత్రమే తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మద్దతు ఇచ్చింది. అనుకున్నట్లుగానే పోలింగ్ రోజు వచ్చేసింది. అప్పుడు చూసుకుంటే చిక్కాల (టిడిపి) తరుపున చాలా పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కనిపించలేదు. పార్టీ కేడర్ ను ఈ ఎన్నికల్లో పెంచుకోకుండా వదిలేసినందుకే చిక్కాలకు ఓట్లు తగ్గాయని అంచనా. ఆయనకు గతంలో గుత్తుల సూర్యనారాయణబాబు కన్నా తక్కువ ఓట్లు వస్తాయని పరిశీలకులు లెక్కతేలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు, తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే తలపడ్డట్టు అయింది. మధ్యాహ్నం నుంచి చిక్కాల తరుపున పోలింగ్ ఏజెంట్లే కేంద్రంలో లేరని పరిశీలనల్లో తేటతెల్లమైంది. చంద్రబాబు తమ పార్టీ తరుపున గెలిచే స్థానాల్లో రామచంద్రాపురం లెక్కించడం విశేషం.