జోష్.. వాంతుల రోగి
posted on Jul 24, 2022 @ 11:15AM
పిల్లాడు వరుసగా నాలుగు తమ్ములు తుమ్మితే.. అది కొంపదీసి వర్షాకాలం కాకుంటే, ఇంట్లో ఉన్నవాళ్లంతా తెగ ఖంగారు పడు తూంటారు. ఇంట్లో బామ్మగారు ఏదో ఆకులు, అల్లం నూరి వాసనపట్టి రెస్ట్ తీసుకోమంటుంది. అంతే సాయంత్రానికి ఠక్కున అన్నీ తుమ్ముల బెడదా తీరి ఆడుకోడానికి వెళతాడు.. బామ్మగారు నవ్వుకుంటారు. కానీ జోష్ రైట్ అనే 13ఏళ్ల పిల్లవాడి సంగతే వేరు. వాడికి ఇలాంటి చిట్కాలేమీ పనిచేయవు. అతను చిత్రమైన వాంతుల జబ్బుతో బాధపడుతున్నాడు. ప్రతీ ఐదు నిమిషాలకు పెద్ద వాంతిచేసుకుంటాడు!
ఎడిన్‌బర్గ్‌కి చెందిన జూలీ పిల్లాడే ఈ జోష్ రైట్. చాలాకాలం నుంచి ఈ పిల్లాడికి గొంతు మండినట్టయి వాంతులు అవు తుంటాయి. ఇదేదో మహమ్మారి మన ఊళ్లలో అనేక భూత పిశాచ వైద్యాలు చేయించేస్తారు. కానీ ఎడిన్‌బర్గ్‌లో అలాంటి అవకాశం లేదు. పిల్లా డిని ప్రతీ ఆరు వారాలకు ఒకసారి ఆస్పత్రికి జూలీ తీసికెళుతుంటారు. చిత్రమేమంటే విచిత్ర వామిటింగ్ సిండ్రోమ్ (విఎస్) మూల కారణమేమిటన్నది వాళ్లకి అంతు చిక్కడం లేదు. ఎన్ని పరీక్షలు చేసినా వారికి అర్ధం కావడంలేదని డాక్టర్లే చెబుతున్నారు. లోకంలో ఇలాంటి జబ్బూ ఉంటుందా అని చర్చిస్తున్నారు.
నోరంతా ఉమ్మి చేరుకుంటుంది వెంటనే వాంతి చేసుకుంటూంటాడు. దీనికి తోడు అప్పుడప్పుడూ రక్తం కూడా పడుతోందిట. ఇది మరీ ప్రమాదకరమని అందరూ గ్రహించారు. 13ఏళ్ల పిల్లాడు ఏమయిపోతాడా అని ఆ తల్లి భయపడుతోంది. మామూలు దగ్గు, జ్వరమైతేనే బడికి రావద్దని అంటూంటారు. పాపం జోష్‌కి చదువుకోవాలని, డాక్టర్ కావాలని ఉంది. కానీ స్కూలు చదువే అయ్యేట్టు లేదు. ఇంటిదగ్గర ట్యూషన్ చెప్పడానికి కూడా టీచర్లు భయపడుతున్నారట. వారికీ ఇది అంటుకుంటుంది. ఇది అంటువ్యాధి కాదని మొత్తుకుంటున్నా వారి భయం వారిది. అసలా వీధిలోకి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయడంలేదు.
ఇతర పిల్లలు, స్నేహితులు అంతా బాగానే చదువుతున్నారు, ఆడుకుంటున్నారు.. తనకెందుకు ఇలా అయిందని పిల్లాడు దిగులు పడి మరీ నీరసించాడు. స్కూలుకి సరిగా వెళ్లలేకపోతున్నాడు. క్లాసులో ఇతరులకు ఇబ్బందిగా ఉందని అతనే ఇంటి దగ్గర చదువుతానంటున్నాడు. జోష్‌కి ఒకడే కొడుకు. వీడిని బాగా చదివించి మంచి ఉద్యోగిగా చూడాలని ఎన్నో కలలు కంటోం ది. కానీ జోష్ ఆరోగ్యం ఆమెను భయపెడుతోంది. ఎవరికీ చెప్పుకోలేదు, డాక్టర్లూ ధైర్యం చెప్పలేకపోతున్నారు. అతనికి జీవితాంతం ఈ జబ్బు ఉంటుందనే అంటున్నారు. మరి పూర్తిగా తగ్గేది ఎన్నడన్నది పరిశోధకులు తేల్చాల్సిందేనట. ఇక ఆమెకు వాడి తోనే జీవితం, ప్రతీ క్షణం.