విశాఖవాసుల నుంచి నిరసన
posted on May 2, 2023 @ 12:24PM
విశాఖపట్టణం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని రెండునెలల క్రితం అనౌన్స్ చేసినప్పటికీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగలేదు.
ఏప్రిల్ 23, 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే, 2020లో, రాష్ట్రం ఒక చట్టం ద్వారా అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలు అనే మూడు రాజధాని నగరాలను నోటిఫై చేసింది. ఈ నోటిఫై తర్వాత విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.
విశాఖలో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి సత్యం - మూడు రాజధానులు భ్రమ' అనే అంశంపై యువజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. విలువైన భూములు దోచుకునేందుకే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని... సదస్సులో పాల్గొన్న యువత అభిప్రాయపడింది. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనజాగరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలనే కొత్త సంప్రదాయానికి తెరలేపడం మంచిది కాదన్నారు. ప్రజలను గందరగోళ పరచకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంలో వైఎస్ ప్రభుత్వం మనసు మార్చుకుంది. విశాఖ పెట్టుబడులకు ఆహ్వానించింది. రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సుమ్మిట్లో ముఖ్యమంత్రి వైజాగ్ రాజధాని అని అనౌన్స్ చేశారు. నేను కూడా విశాఖకు వచ్చేస్తానని హామి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనౌన్స్ చేసే సమయానికి అమరావతి రాజధాని కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. సుప్రీంలో కేసు విచారణ దశలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రాజకీయ కారణాలచేత వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశారని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అమరావతి క్యాపిటల్ అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జనజారణ సమితి మరోసారి ఆందోళన చేపట్టనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ , విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.ఇదే అవకాశంగా తీసుకున్న జనజాగరణ సమితి జగన్ కు వ్యతిరేక ప్లెక్సీలను వైజాగ్ లో అంటించింది. ‘‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం, సుస్వాగతం అనే ప్లెక్సీలు వైజాగ్ లో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి.