విజయ్ మాల్యాకు మరో దెబ్బ..
posted on Jul 14, 2016 @ 9:25PM
వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ పారిశ్రామివేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్నార్టియం ఆయనపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్నార్టియం తన పిటిషన్‌లో కోరింది.
ఈ నెల 18న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రూ.9వేల రుణాల ఎగవేత కేసును తప్పించుకునేందుకు రూ.4 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని మాల్యా ఆఫర్ చేశాడు. అయితే ఈ ఆఫర్‌ను బ్యాంకులు తిరస్కరించడంతో గత ఏప్రిల్‌లో ఆస్తుల వివరాలు తెలియజేయాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు అంగీకరించిన మాల్యా.. ఆ వివరాలను బ్యాంకులకు ఇవ్వవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వివరాలు వెల్లడించకపోవడంతో బ్యాంకుల కన్సార్టియం ఈ పిటిషన్ దాఖలు చేసింది.