మణిపూర్లో ప్రజ్వరిల్లిన హింసాకాండ!
posted on May 4, 2023 @ 3:10PM
మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని పిలిచారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంఫాల్ నగరాల్లో హింసాకాండ పెచ్చువిూరింది. ఈ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించారు. మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది.
అయితే వారికి సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం (మే 3)నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెవెూరియల్ గేటుకు నిప్పు పెట్టడం వల్లనే హింస ప్రజ్వరిల్లిందని అంటున్నారు.
ఇంఫాల్, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారనీ, ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారనీ విమ్శించారు. ఈ హింసాకాండలో కొందరుర మరణించారు. చాలా మంది గాయపపడ్డారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.
కేంద్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ హింసాకాండపై స్పందించారు. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే ఆ హింసాకాండ ప్రజ్వరల్లడానికి కారణమని అన్నారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యలకు పరిష్కార మార్గం కనుగొంటాని హామీ యిచ్చారు. మెయిటీలకు ఎస్‌టీ హోదాను ఇవ్వాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నవారు స్పందిస్తూ, మణిపూర్ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చడం వల్ల తమకు ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని వాపోతున్నారు.
మెయిటీలు ముఖ్యంగా ఇంఫాల్ లోయలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 40 శాతం మేరకు ఉంటారు. నాగాలు, కుకీలు కూడా గిరిజనులే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పారామిలిటరీ దళాలను వెూహరించారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యం కవాతు నిర్వహిం చింది. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది పాల్గొంటున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మెయిటీలు వాదిస్తున్నారు.
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్ నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహాయపడండి అని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర వెూదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ విూడియా సంస్థలకు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మణిపూర్ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు.