మీరు తిండికి తిమ్మరాజు.. మీరు అవినీతికి తిమ్మరాజు
posted on Jun 11, 2020 @ 3:54PM
ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా శ్రమించినా గత ఏడాది జరిగిన ఎన్నికలలో అనూహ్యమైన ఓటమి తరువాత టీడీపీ కేడర్ లో కొంత నైరాశ్యం నెలకొంది. దీంతో టీడీపీకి యువ రక్తాన్ని ఎక్కించి మళ్ళీ పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఎపి టీడీపీ అధ్యక్షుడిగా యువకుడైన రామ్మోహన్ నాయుడికి బాధ్యతలు అప్పగించవచ్చని కూడా టాక్ నడుస్తోంది. తాజాగా ఇదే విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో లోకేష్ ను టార్గెట్ చేస్తూ "కొడుకేమో తిండికి తిమ్మరాజు.. పనికి పోతురాజు". పార్టీ సీనియర్లంతా చేతులెత్తేశారు. ఇపుడు ఎవరైతే ఏంటని రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబుగారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకో చూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నాడు. అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై తాజాగా స్పందించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు "అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు, పనికి పోతురాజు.. సీనియర్లు అందరు చేతగానోడి పాలనా చూసి "ఛీ" కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు.. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప మామ అల్లుడి వల్ల ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్ళు మొక్కడం ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు.. అంటూ అటు సీఎం జగన్ ను ఇటు విజయ్ సాయి రెడ్డిని టార్గెట్ చేశారు.