విజయమ్మ కరివేపాకేనా..!?
posted on Jul 29, 2022 @ 1:02PM
కొందరికి కొందరు కలిసివస్తారు. కలిసొచ్చిన కాలమంతా వారి మాట, చెలిమికి లేదా ప్రేమాభిమానాలకు అపూర్వ ప్రత్యేకతనిచ్చి ఆనక ఆటలో అరటిపండులా భావించి దూరం చేస్తుంటారు. ఇదంతా రాజ కీయాల్లోనూ సాధ్యం. ఎందుకంటే పార్టీలకు, నాయకులకు ఉన్నంత సెంటిమెంట్ పిచ్చి మరెవ్వరికీ ఉండదు. ఫలానా ఆయన పార్టీలోకి రాగానే అంతా బ్రహ్మాండం అంటారు. ఈయనతో ప్రచారానికి వెళితే అంతే మహాద్భుతమన్నవారే ఆ తర్వాత మరేదో కారణంగా మరేదో జరిగితే మొదటి స్నేహాన్ని కాదం టారు. అసలా మాటకి వస్తే రాజకీయ చదరంగంలో కుటుంబ సెంటిమెంట్లకి బొత్తిగా అవకాశం లేదన్నది వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వై.ఎస్.విజయలక్ష్మిని తొలగించడం స్పష్టంచేస్తుంది. ఇక్కడ కన్నాం బలు, రుష్యేంద్రమణి, గుమ్మడి .. ఈ వ్యవహారాలకు తావులేదు. అందుకే ఆమె చాలా సైలెంట్‌గా కుమార్తె నీడ లోకి వెళ్లారు.
తన కుమారుడికి ఒక్క అవకాశం ఇవ్వమని విజయలక్ష్మి ప్రజల్ని కోరడంతో ప్రజలు పెద్ద మనసు చేసు కుని అధికారం అప్పగించారు. కానీ అధికారం తాలూకు ప్రభావం జగన్‌ను విర్రవీగేలా చేసిందనే అభిప్రా యాలే వినవస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో జగన్ను వై.ఎస్ కుమారుడన్న అభిమానం తోనూ ఉండనీయడానికి ప్రజలు ఇష్టపడటంలేదు. కారణం జగన్ పాలన అంతగా ప్రభావం చూపక పోగా, అన్నివిధాలా విఫలమయిందని విశ్లేషకులు అంటున్నారు. కనుకనే అందలం ఎక్కించిన ప్రజలే ఇపుడు దిగిపోతే బావుండునని అనుకుంటున్నారు. విజయమ్మ తనకొడుకు వెనకే ఉండి రాజకీయాల్లో ముందుకు నడిచేలా తన భర్త ఆలోచనలను కొడుకు ద్వారా అమలు చేయాలని ఆమె అనుకోవచ్చు. కానీ అలాగేమీ జరగకపోగా ఆమెను కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఒక బ్రహ్మాస్త్రంగానే జగన్ ఉపయో గించుకున్నారని రాజకీయ విశ్లేషకుల భావన.
ఇటీవలి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉండి పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా వెంటనే సహాయం చేసేవారు. కొడుకు కష్టం లో ఉన్నపుడు, అలాగే జైలు లో ఉన్న 18 నెలలు పార్టీ లో ఎలాంటి అసమ్మతి రాకుండా పార్టీ ని ఒక్కతాటి పై నడిపించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో, కొన్ని గ్రహాల ప్రోద్బ లంతో తల్లి తో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు. మొద టగా చెల్లిని పార్టీ నుంచి పంపించి, పార్టీ పరంగా, అలాగే కుటుంబ పరంగా విభేదాలు కల్పించారు. ఇప్పు డు తల్లిని ప్లీనరిలోనే తన రాజీనామా ఇచ్చేలా చేసారు. ఈ పరిణామాల వెనక జగన్మోహన రెడ్డి భార్య భారతి ఉన్నట్టుగా కొంతమంది ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.
కుమారరత్నం చేసిన దానికి విజయమ్మ ఊహించని షాక్‌కి గురయ్యారనే అనాలి. ఇహ ఆమెకు మిగిలింది తన కుమార్తె షర్మిలకి సపోర్ట్ గా నిలవడమే. అందుకే ఇక్కడ పార్టీ కి రాజీనామా చేస్తున్నానని చెప్పిన విజయమ్మ తను రాజీనామ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఆలోచించారో లేదో ననే అభిప్రాయాలున్నా యి. ఇప్పటికే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తున్న నేపద్యంలో జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణ యం అతని నిరంకుసత్వ ధోరణికి అద్దం పడుతోంది. తనే రాజు తనే మంత్రి అన్న విధంగా ఉన్న నిర్ణయాలు జగన్ని పాతాళానికి తొక్కేస్తాయనే విషయం అర్ధం తేటతెల్లమ వుతోంది.
జగనన్న వదిలిన బాణం, రాజన్న కుమార్తెనని, అన్నకోసం మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న జైలులో ఉండగా పార్టీకి, కుటుంబానికి అండగా ఉండి, అన్నకి ఒక్కసారి అధికారం ఇవ్వమని ప్రజల్ని కోరిన షర్మిల కి జగన్ ఇచ్చిన ప్రతిపలం చూసి రెండు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలు వేసుకు న్నారు. ఇక్కడనుంచి వెళ్లి తెలంగాణా లో సొంత కుంపటి పెట్టుకుని, పాదయాత్ర ల పేరుతొ ఊరూరా తిరుగుతూ రాజన్న రాజ్యం తెలంగాణాలో తీసుకువస్తా అని చెప్పి తిరుగుతున్న ఈ బాణం గురి తప్పు తుందేమోనని విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పాలనా చూసిన వాళ్ళు ఎవరైనా ఈమెకి అవకాశం ఇస్తారా అనే సందేహాలు లేకపోలేదు. ఐతే ఇప్పటికే తెలంగాణా వ్యాప్తం గా షర్మిల వివిధ రకాల గా ప్రజలని కలుస్తున్నారు.కొంచం రాజశేకరరెడ్డి హావభావాలు ప్రదర్శించడం, ప్రభుత్వ తప్పిదాలు ప్రజ ల్లోకి తీసుకువెళ్ళడం, దొరపాలన లాంటి పదునైన పదాలతో మాట్లాడడం చేస్తున్నారు. కానీ మాటలతో పనులు జరుగుతాయ అంటే కష్టం అని తెలుసుకోవాలి. దీక్షల పేరుతో కొన్నివర్గాలని ఆకట్టుకునేందుకు తీవ్రయత్నం చేస్తున్నారు.
ఐతే తెలంగాణా లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపద్యంలో షర్మిల ఆగష్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేస్తున్నారని తెలిస్తోంది. ఆమెతో పాటు విజయమ్మ కూడా కొంత పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. అయితే ఇక్కడ విజయమ్మకి తెలంగాణా వైసీపీ లో ఎలాంటి స్థానం కల్పిస్తారోననే ఆసక్తి అందర్లో నెలకొంది. అప్పుడు కొడుకు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవరకు ఎంతో అండగా ఉండి సహాయ సహకారాలు అందించిన విజయమ్మ, మరి ఇప్పుడు కూతురి బాధ్యతని కూడా తీసుకున్నారా అంటే అవు ననే చెప్పాలి. అయితే ప్రస్తుతం విజయమ్మ గారు షర్మిల గారి కి సహాయ సహకారాలు అందించడానికి మాత్రమే ఇక్కడకి వచ్చారని చెప్తున్నారు కానీ అసలు విషయం కొడుకుతో విభేదాలే అసలు కారణం అని షర్మిల సన్నిహితుల మాట. షర్మిలని కూడా వచ్చే తెలంగాణా ఎన్నికలలో గెలిపించి అసెంబ్లీ కి పంపా లనే దృఢ నిశ్చయంతో వచ్చినట్టు ఉన్నారు విజయమ్మ. ప్రస్తుతం తల్లిని తెలంగాణా ఎన్నికలు దృష్టి లో పెట్టుకుని తనతో తెచ్చుకున్నట్టు షర్మిల మాటల అంతరార్దం. కేవలం తల్లిని ఎన్నికలలో గెలుపు కోసమే వాడుకోవడంతో అటు జగన్ ఇటు షర్మిల ఇద్దరూ రాజకీయ నాయకులలాగే ప్రవర్తించారు కానీ కుటుంబ విలువలకి ఎక్కడా ప్రాదాన్యం ఇచ్చి నట్టు కనిపించట్లేదు. కేవలం తల్లిని రాజకీయాలలో విజయం సాధించడానికి ఒక అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారు. తెలుగు ప్రజల సెంటిమెంట్ని ఉపయోగించుకోవడం లో రాజన్న పుత్రుడు సఫలం అయ్యాడు,మరి పుత్రిక విషయం లో ఏం జరుగుతుందో కొంతకాలం ఎదురు చూడక తప్పదు.