వాసవీ అమ్మవారికి నోట్ల అలంకరణ!
posted on Oct 1, 2022 @ 10:27AM
భక్తికి అంతేలేకుండా పోతోంది. చాలాకాలం కేవలం పూలతో దేవాలయాలు అలంకరించేవారు. గుడి ద్వారం లోపలి గోడలు అంతా చక్కగా పూలదండలతో దివ్యంగా కనుల విందుగా చేసేవారు. ఇప్పుడు కూడా చాలా దేవాలయాల్లో చేస్తున్నారు. కానీ విశాఖపట్నం వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మాత్రం ఈసారి శరన్నవరాత్రులకు భక్తులు, దాతలు ఇచ్చిన నోట్లతో దేవాలయం లోపలంతా అలంక రించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.
విశాఖపట్నంలో 135ఏళ్ల నాటి ఈ దేవాలయంలో ఈ పర్యాయం నవరాత్రులు ఎంతో కొత్తగా నిర్వహిం చాలని ఆలోచించారు ఆలయకమిటివారు. అమ్మవారి విగ్రహం బంగారుపూతతో అలంకరించారు. గోడలు, నేల అంతా నోట్లు అతికించడమే అందరినీ చకితులను చేస్తోంది.ఈ మొత్తం చేపట్టడానికి సుమారు ఎని మిది కోట్ల అయిందని ఆలయకమిటీ తెలిపింది.
అయితే నవరాత్రుల తర్వాత ఆ సొమ్మంతా ఏమి చేస్తా రని అడిగితే అలంకరణకు దాతలు ఇచ్చారు. ఆ సొమ్మ ఆలయ ట్రస్ట్ తీసుకోదని, దాతలకే మళ్లీ తిరిగి ఇచ్చేస్తామన్నారు. గుడి ఆవరణలో, ద్వారం వద్ద తోరణాలు కూడా నోట్లనే అమర్చడం గమనార్హం. గుడి ఆవరణలో చెట్లమీంచి కూడా నోట్ల తీవెలే వేలాడుతూ ఎంతో ఆకట్టు కుంటున్నాయి.