విజయసాయి పై కఠిన చర్యలకు వర్ల డిమాండ్
posted on Aug 5, 2022 @ 11:54AM
సామాజికమాధ్యమాలను అడ్డుపెట్టుకుని తెలుగు దేశం నాయకులపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచా రం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ నేతలు గుర్రంపాటి దేవేంద ర్ రెడ్డి, విజయసాయిరెడ్డి లపై సీఐడీ ఏడీజికి వర్ల ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ కుమార్తె మరణాన్ని అనుమానిస్తూ వైసీపీ నేతలు టీడీపీ యువనేత నారా లోకేష్‌పై చేసిన ప్రచా రం దారుణమన్నారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తం ఆ విధంగా విమ ర్శలు చేయడం పట్ల వర్ల మండిపడ్డారు. వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిలో వాస్తవమే లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు.
ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న దేవేంద్రరెడ్డి, విజయసాయిరెడ్డిలపై కఠన చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ నాయకులపై హత్యారాజకీయాలు అంటగడుతున్నా రని ఆరోపిస్తూ నక్కా ఆనందబాబ, ఆలపాటి రాజా, అశోక్ బాబు మంగళగిరి రూరల్ సీఐని సంప్రదించగా ఆయన బాధ్యతా రాహి త్యంగా ప్రవర్తించడం పట్ల కూడా వర్ల మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.