చరిత్ర సృష్టించిన పూజాఓజా
posted on Aug 5, 2022 @ 11:51AM
భారత పారా కనోయింగ్ అథ్లెట్ పూజా ఓజా సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలో జరిగిన ఐసీఎఫ్ కనోయి స్ప్రింట్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రజతం సాధించి.. ఈ టోర్నీలో పతకం గెలిచిన తొలి భారత పారా అథ్లెట్‌గా రికార్డు కెక్కింది. మహిళల వీఎల్1 200 మీటర్ల ఫైనల్లో పూజ 1:34.18 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది.
కామన్వెల్త్ హాకీ లో ఇప్పటికే మహిళలు సెమీస్ చేరగా, పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరువలో నిలి చింది. పూల్-బిలో భాగంగా గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 4-1తో వేల్స్ జట్టును ఓడిం చింది. దీంతో తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. హర్మన్‌ప్రీత్ (19వ, 20వ, 40వ) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా.. మరో గోల్‌ను గుర్జాంత్ సింగ్ (49వ) చేశాడు. వేల్స్ తరఫున ఏకైక గోల్‌ను గారెత్ ఫర్లాంగ్ (55వ) కొట్టాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సింధు, శ్రీకాంత్ బోణీబ్యాడ్మింటన్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించిన షట్లర్లు సింగిల్స్‌లో తమ సత్తా చాటారు. పీవీ సింధు, కిడాం బి శ్రీకాంత్ ఆరంభ రౌండ్లను అధిగమించి ప్రీ క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-4, 21-11తో ఫాతిమా (మాల్దీవులు)పై, పురుషుల సిం గిల్స్ లో శ్రీకాంత్ 21-9, 21-9తో డానియెల్ (ఉగాండ)పై గెలిచారు.
స్క్వాష్ మిక్స్‌డ్ క్వార్టర్స్‌కు పళ్లికల్ జోడీ స్క్వాష్ సింగిల్స్ పోటీలకు దూరంగా ఉన్న స్టార్ దీపికా పళ్లికల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం బాటలో ఉంది. ఈ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్‌లో పళ్లికల్/సౌరవ్ ఘోషల్ జంట 11-8, 11-4తో వేల్స్ జంట ఎమిలీ, పీటర్ క్రీడ్‌ను చిత్తుచేసింది. మిక్స్‌డ్‌లో మరో జోడీ జోష్న చినప్ప/హరిందర్‌పాల్ సంధు 8-11, 9-11తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో టీనేజర్ అనహత్ సింగ్/సునయన కురువిల్లా జోడీ 11-9, 11-4తో శ్రీలంక ద్వయం యెహెని/చనిత్మపై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. టేబుల్ టెన్నిస్ శరత్, శ్రీజ లు శుభారంభం టీటీ మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్-32లో భారత జోడీ ఆచంట శరత్ కమల్/ఆకుల శ్రీజ 3-0తో ఓవెన్/సోఫీ (నార్తర్న్ ఐలాండ్)పై నెగ్గిం ది. మహిళల సింగిల్స్ రౌండ్-32లో రీత్ టెన్నిసన్ 4-1తో చార్లొటే (ఇంగ్లండ్)పై, శ్రీజ 4-1తో కారెన్ లిన్ (మలేసియా)పై గెలుపొందారు.