ఉత్తరాఖండ్ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతు
posted on Aug 5, 2025 @ 9:30PM
ఉత్తరాఖండ్ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వరద ఉధృతికి ధరాలీలోని హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న జేసీవో సహా ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. మరోవైపు.. వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు.
హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ప్రకృతి విలయంలో 60 మందికి పైగా ప్రజలు గల్లంతైన విషయం తెలిసిందే. 20-25 హోటళ్లు, నివాసాలు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సైన్యం సహాక చర్యలు చేపట్టింది.