తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Aug 6, 2025 9:21AM
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం (ఆగస్టు 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 27 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (ఆగస్టు5) శ్రీవారిని మొత్తం 72 వేల951 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 143 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం క్యైలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్న, జల ప్రసాదాలను పంపిణీ చేస్తున్నది. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసింది.