రగిలిపోతున్న బిజ్నూర్.. అమ్మాయిలపై వేధింపులు.. ముగ్గురు హత్య
posted on Sep 16, 2016 @ 6:17PM
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్లో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది. చిలికి చిలికి వాన అయిన సామెత ప్రకారం.. చిన్నపాటి గొడవ కాస్త ముగ్గురు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. వివరాల ప్రకారం.. యూపీలోని బిజ్నూర్ పట్టణంలో స్కూలుకు వెళుతున్న కొంతమంది అమ్మాయిలను.. ఓ వర్గానికి చెందిన యువకులు వేధించారు. దీంతో విద్యార్ధినిలు నేరుగా ఇళ్లకు వెళ్లి విషయం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు యువకులను నిలదీసేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నాయి. దీంతో యువకుని తరుపున ఓవ్యక్తి తుపాకీ తీసి అమ్మాయిల తరుపున వారిపై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ఓవ్యక్తి చనిపోగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరుపక్షాలను చెదగొట్టారు. ఈ సందర్భంగా డీజీ దల్టీత్ చౌదరి మాట్లాడుతూ.. చనిపోయిన యువకులను అహసాన్, సర్తాజ్, అనీస్ లుగా గుర్తించామని, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులను మృతదేహాలను అందజేస్తామని.. బిజ్నూర్ కల్లోలంపై ప్రత్యేక దృష్టిసారించరమని తెలిపారు.