హెచ్సీయూలో దారుణం.. మరో విద్యార్ధి ఆత్మహత్య..
posted on Sep 17, 2016 @ 10:36AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతంలో దళిత విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఫేమస్ అయిన వర్శిటీలో మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం అయింది. ప్రవీణ్ అనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. వర్శిటీలో ఎంఎఫ్ఏ ఫస్టియర్ చదువుతున్న ప్రవీణ్ హాస్టల్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ నెల రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు. రెండు రోజులకే ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. అయితే ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందో తెలియాల్సి ఉంది. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ముందుగానే హెచ్సీయూ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.