కలకలం రేపిన ఉత్తమ్ పొలిటికల్ కన్సల్టెంట్ కిడ్నాప్!
posted on Nov 22, 2023 @ 10:14AM
తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరింది. విమర్శలు, ప్రతివిమర్శల స్థాయి దాటి కిడ్నాప్ లు, దాడుల వరకూ చేరింది. ఇప్పటికే ఎన్నిల ప్రచారంలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిపై హత్యాయత్నం చేసిన సంగతి విదితమే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై యత్నాయత్నం సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఆ తరువాత కూడా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే.
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చే సరికి ఆ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇక తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలిటికల్ కన్సల్టెంట్ కిడ్నాప్ యత్నం ఉదంతం సంచలనం సృష్టించింది. పైగా ఈ కిడ్నాప్ కు ప్రయత్నించింది అధికార పార్టీ ఎమ్మెల్యే సైది రెడ్డి కావడం గమనార్హం.
యం.పి ఉత్తమ్ కోసం పనిచేస్తున్న పొలిటికల్ కన్సల్టెంట్ బండి రామ స్వామిని కిడ్నాప్ చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యూ సైది రెడ్డి ప్ర యత్నించారని బాధితుడు రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వెళ్లి రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రచారం ముగించుకుని వెళుతునన తనను బీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారనీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పని చేయవద్దని బెదరించారనీ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సైది రెడ్డి తన కారు బలవంతంగా ఎక్కించుకొని తన సెల్ ఫోన్ గుంజికొని కోదాడ రోడ్ లో గల తన విల్లా కు తీసుకొని పోయి మీ టీమ్ సభ్యులు ఉత్తమ్ కు పని చేయడానికి వీలు లేదని హెచ్చరించారని బండి రామస్వామి పేర్కొన్నారు.
అనంతరం మేము లక్షల కోట్లు పెట్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా జీవితాలతో ఆడుకుంటావా అని స్థానిక సి. ఐ రామ లింగారెడ్డి కి ఫోన్ చేసి వీరి పై దొంగలు గా కేసు పెట్టాలని, వీరి ఐ.డి కార్డులు తీసుకోవాలని సైది రెడ్డి చెప్పారని బాధితుడు తెలిపారు..అంతే కాకుండా తాను ఫ్యాక్షనిస్టుననీ, మాట వినకపోతే నిన్నూ నీ కుటుంబాన్ని చంపుతా అని సైదిరెడ్డి తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. ఆ తరువాత తనను వదిలేసి ఉత్తమ్ కు పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరో మారు హెచ్చరించినట్లు తెలిపాడు. ఎమ్మెల్యే సైది రెడ్డి తో తనకు ప్రాణ హాని ఉందనీ, తనకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని బండి రామస్వామి ఫిర్యాదులో కోరారు.