యూటికి మేం వ్యతిరేకం
posted on Nov 23, 2013 7:32AM
రాష్ట్రవిభజన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్ ఒవైసి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని కలిశారు. శుక్రవారం మద్యాహ్నం సోనియాను కలిసిన ఆయన 45 నిమిషాల పాటు చర్చించారు.కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికనే తిరిగి సోనియాగాంధీకి కూడా వినిపించానని అసదుద్దీన్ చెప్పారు.
హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దని ఆయన సోనియాను కోరారు. హైదరాబాద్‌ను ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని చేయాలన్న సీడబ్ల్యుసీ ప్రతిపాదనకు కూడా తాము వ్యతిరేకమని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానీ మరొక రాష్ట్రంలో లేదని గుర్తు చేశానన్నారు. ఒకవేళ తప్పదని భావిస్తే కనుక కేవలం ఖైరతాబాద్ మండల పరిధికే ఉమ్మడి రాజధానిని పరిమితం చేయాలని సోనియాను కోరానని అసదుద్దీన్ తెలిపారు.