రికార్డు స్థాయిలో యు.ఎస్.వీసాలు
posted on Oct 15, 2022 @ 11:37AM
పెద్ద చదువులకో, పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటున్న యువత చాలామంది అమెరికా వెళ్లాలన్న ఆలోచనలోనే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు చదువు ముగియగానే విమానం ఎక్కేయాలన్న ఆతృతే కనపరుస్తున్నవారు. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం కూడా భారత్ విద్యార్ధులకు రికార్డు స్థాయిలో వీసాలు విడుదల చేయడం గమనార్హం. చాలామంది భారత్‌విద్యార్ధులు తమ దేశంలో విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించి వీసా పొందడం పట్ల అమెరికా వ్యవహారాలభారత్ ప్రతినిధి పెట్రీషియా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గతేదాడి కోవిడ్ కారణంగా అక్కడి వర్సిటీల్లో అడ్మి షన్లలో జాప్యం వల్ల విద్యార్ధులు చేరలేకపోయారు. కాగా 2022 ఏడాదికి రికార్డుస్థాయిలో 82 వేల మంది విద్యార్థులకు వీసాలు విడుదల చేయడం గమనార్హం.
స్వల్పకాలం ఉ్యదోగ లేదా వ్యాపారనిమిత్తం అమెరికా వెళ్లాలనుకున్న వ్యాపారులు, టూరిస్టుల వీసాలు ముఖ్యంగా బి1, బి2 వీసాలు మాత్రం 2024 మధ్యకాలంలోనే అందుబాటులోకి వస్తాయని ఆమె ఒక ప్రకట నలో తెలియజేశారు. అయితే అన్ని దేశాల కంటే అమెరికా లో విశ్వవిద్యాలయాలు, సంస్థల పట్ల భారత్ విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకు ప్రపంచంలోకెల్లా ఎన్నదగ్గ కేంద్రంగా అమెరికాను గుర్తించడం పట్ల అమెరికా ఎంబసీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను విద్యార్ధులు, ఉద్యోగులు మరింత ఉన్నతస్థాయికి తీసికెళుతుండడం పట్ల అమెరికా ప్రభుత్వం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరు గుపరుస్తుందని పెట్రీషియా అన్నారు. న్యూఢిల్లీ, చెన్నై,హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలలోని అమెరికా దౌత్య కార్యాల యాలు గత నాలుగు మాసాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధి వీసాలకు దరఖాస్తులు పంపాయి. కోవిడ్ తర్వా త గతేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో 62వేల వీసాలు పర్యాటకులకు జారీచేసింది.