యూరియా పోరు...సొమ్మసిల్లిన రైతు
posted on Sep 7, 2025 @ 11:34AM
పంటలకు సమయానికి యూరియా వేయకపోతే పంటలు పూర్తిగా నష్టపోతాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు తెల్లవారు జామునుండే విక్రయ కేంద్రాల వద్ద రైతులు క్యూలైన్లో వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దీంతో ఓ మహిళ రైతు సోమ్మసిల్లి కింద పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా, నర్సంపేట పిఎస్‌సిఎస్ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం నుండే రైతులు యూరియా కోసం బారులు తీరారు. 444 బస్తాలతో యూరియా లోడు రాగా సుమారుగా 1000 మంది రైతులు . లైన్లో నిల్చొని ఉన్నారు. రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. సాగు చేసి పంటలకు యూరియా చల్లకపోతే పంటలు పాడైతయని.. పెట్టుబడులు పెట్టి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం పదకొండు గంటలైనా యూరియా బస్తా దొరకపోవడంతో బిచ్చానాయక్ తండా కు చెందిన అజ్మీర అరుణ సోమ్మసిల్లి కిందపడింది. మరోవైపు పక్కనే ఉన్నతోటి మహిళా రైతులు సపర్యాలుచేయడంతో స్పృహలోకి వచ్చింది.. పర్షనాయక్ తండాకు చెందిన అజ్మీర కమలమ్మ అనే వృద్ధురాలు సోమ్మసిల్లి పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ యువకుడు,పోలీసులు సిపిఆర్ చేయడంతో ఆ వృద్ధురాలికి మేలుక వచ్చింది. తెల్లావారు జామునుండి వచ్చిన రైతులకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ సకాలంలో యూరియా అందించి తమ పంటలను కాపాడాలని అన్నదాతలు అధికారులను వేడుకొనుచున్నారు