అధికారంలోకి మాయవతి... సర్వే చెప్పిన నిజం
posted on Sep 9, 2016 @ 12:19PM
2017 లో జరగబోయే యూపీ ఎన్నికల నేపథ్యంలో కొత్త కొత్త అంశాలు చోటుచేసుకుంటున్నాయి. యూపీ ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా అధికారం చేపట్టాలని పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. అయితే ఓ సర్వే ప్రకారం ఈసారి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 25 వేల మందిని భాగం చేస్తూ నిర్వహించిన సర్వేలో.. 403 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో బీఎస్పీకి 169 సీట్లు రావచ్చని నివేదికలో పేర్కొంది. ఆ తరువాత బీజేపీ రెండో స్థానంలో నిలవవచ్చని అంటున్నారు. అయితే బీజేపీ వెనుకబడటానికి గల కారణాలు కూడా చెబుతున్నారు. పెరిగిన ధరలను కిందకు దించలేకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా చెప్పలేకపోవడమే బీజేపీని వెనక్కిలాగుతున్నాయట. ఇక కాంగ్రెస్ స్థానాలు 28 నుంచి 15కు తగ్గుతాయని అంచనా వేసింది. మాయావతి సీఎంగా వస్తే బాగుంటుందని 32 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతుండగా, అఖిలేష్ యాదవ్ ను 15 శాతం మందే కోరుతున్నారని వివరించింది. మరి ఏది నిజమో.. సర్వే ఎంత వరకూ కరెక్టో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.