కేంద్ర బడ్జెట్ లోని టాప్ అంశాలు ఇవే!
posted on Feb 1, 2021 @ 1:32PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ తెచ్చారు. ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగం కోసం వాడారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తోనే. దీంతో ఆమె ఆత్మ నిర్భర భారత్‌కి అలా చిన్న సపోర్ట్ ఇచ్చారు. బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి. రైల్వే రంగానికి 1.15 లక్షల కోట్లు కేటాయించడంతోపాటుగా.. భారత నూతన జాతీయ రైల్వే ప్లాన్ 2030ని ప్రకటించారు. సరసమైన హౌసింగ్ లోన్‌పై కీలక ప్రకటన చేశారు. మార్చి 31, 2022 వరకూ సరసమైన గృహ రుణాలు తీసుకునేవారికి... అదనంగా మరో రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
2021- 22 కేంద్ర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు
- జల జీవన్ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు
- కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం రూ. 35,400 కోట్లు
- వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లు
- రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ యోజన
-మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్
- కొత్తగా బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
- రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
- ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
- ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
-2021-22లో పవన్ హాన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ
- కనీస మద్దతు ధరకు రూ. 1.72 లక్షల కోట్ల వ్యయం
- 2020-21లో రైతు సంక్షేమానికి రూ. 75 వేల కోట్లు
- రైతు రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
- గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు
- విద్యుత్ రంగానికి రూ. 3.05 లక్షల కోట్ల కేటాయింపు
- ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
- జమ్మూ కశ్మీర్‌లో నూతనంగా గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు
- సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.1000 కోట్లు
- బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
- బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు
- రూ.2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
- పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
- పన్ను మినహాయింపులు మరో ఏడాది పెంపు
- ఇల్లు కట్టుకునే మధ్య తరగతి వర్గానికి మరింత ఊరట
- టాక్స్ ఆడిట్ పరిమితి రూ. 10 కోట్లకు పెంపు
- కనీసం 120 రోజులు ప్రవాసంలో ఉన్న వారికే వర్తింపు
- రాగిపై పన్ను మినహాయింపులు
- జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు
- కాటన్ పై 10 శాతం అదనపు పన్ను