ఉండవల్లి కి అరెస్ట్ వారెంట్ జారీ
posted on Feb 19, 2013 @ 1:08PM
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ కి వరంగల్ జిల్లా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. రాజమండ్రిలో నిర్వహించిన సమైక్యాంధ్ర సభలో తెలంగాణవాదులను రజాకార్లతో పోల్చడంపై స్థానిక టీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆయనను అరెస్టు చేయాల్సిందిగా వరంగల్ జిల్లా కోర్టు సుబేదారీ పోలీస్‌స్టేషన్‌ను ఆదేశించింది. ఉండవల్లిపై 153-ఎ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వరంగల్ కోర్టు సుబేదారీ పోలీసులను ఆదేశించింది.