Read more!

అలర్జిక్ వ్యాధుల గురించి నమ్మలేని నిజాలు!!

శ్వాసకోశ వ్యవస్థలోని వివిధ భాగాలు అలర్జీ వ్యాధికి గురవటం చూస్తున్నాము. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, బ్రాంయల్ అస్తమా వంటి వ్యాధులు ఈ కోవకు చెందుతాయి. అలర్జీ అంటే మితిమీరిన సున్నితత్వం అని చెప్పవచ్చు. కొన్ని హానికరంకాని పదార్థాలకు, వాతావరణానికి శరీరం అతి సున్నితంగా స్పందించడమే. ఏ పదార్థానికైతే రోగి సున్నితత్వం కలిగి ఉంటాడో ఆ పదార్థాన్ని అలెర్జిన్ అంటాము. ఈ పదార్థాలు ఇతర ఆరోగ్యవంతులు తీసుకున్నా, ఎక్స్పోజ్ అయినా, ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాని అలా ఉన్నవాళ్ళు ఈ అలెర్జెన్స్ ని తీసుకున్నట్లయితే దేహరక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. దీనినే అలర్జిక్ రియాక్షన్ అంటాము. 


ఇది గాలిలో పుప్పొడి, దుమ్ము . ధూళి, తినే పదార్థాలలోగాని, పాలు, చేపలు, గుడ్లు, పులుపు, పండ్లు మొదలయి వాటికి దేనికైనా ఈ అలర్జీ రోగులు రియాక్ట్ కావచ్చు. ఆరోగ్య వంతులు ఈ పదార్థాలను సులభంగా శరీరంలో ఇముడ్చుకుంటారు. దేహరక్షణ వ్యవస్థ ఈ పదార్థాలను దేహానికి శత్రువులుగా భావించటం వల్ల రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ చర్మం పైకాని, జీర్ణనాళంలో కాని, శ్వాసమండలంలో కాని జరగవచ్చు. శ్వాసమండలంలో ఈ అలర్జీ రియాక్షన్ ఏర్పడటం వల్ల రైనైటిస్, అలర్జిక్ బ్రాంకై టెస్, బ్రాం యల్ ఆస్తమావంటి వ్యాధులు వస్తాయి.


అలర్జీక్ రియాక్షన్ తినే పదార్థాలనుండే కాకుండా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వస్తుంది. కొంతమంది అధిక తేమవల్ల, కొంతమంది చల్లదనం వల్ల, కొంతమంది వాతావరణంలో మార్పులకు కూడా స్పందిస్తారు. వేడి నుండి మేఘాలతో కూడిన తేమ వాతావరణం, మరికొంతమంది వాతావరణం లోని విద్యుత్ మార్పులకు కూడా స్పందించటం జరుగుతుంది. ఆరోగ్యవంతులు ఈ వాతావరణ పరిస్థితులకు సులభంగా తట్టుకోగలరు. అలర్జీ రోగుల్లో వ్యాధినిరోధక శక్తిలో సమతుల్యం లోపించటం వల్లనే ఈ విధంగా అతిగా రియాక్ట్ అవుతారు. 


సాంప్రదాయ వైద్య విధానంలో రోగి ఏ పదార్థాలకు సున్నితంగా ఉన్నాడో, ఆ పదార్థాన్ని డైల్యూట్ చేసి అతిసూక్ష్మ పరిమాణంలో కొంతకాలం రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనినే డిసిన్సిలైజేషన్ అంటారు. అంటే రోగి ఉన్న అతి సున్నితత్వం ఆ పదార్థం నుండి తగ్గిపోతుంది. ఈ పద్ధతి వల్ల రోగి రియాక్ట్ అవటం కొంత తగ్గుతుంది. కాని ఈ రకమైన డిసెన్సిటైనేషన్ వల్ల కూడా ఉపశమం తాత్కాలికమే. కొంతకాలం తర్వాత రోగి ఇంకో పదార్థానికి సున్నితత్వం పెరుగుతుంది. అలర్జిన్ మారిపోతుంది కాని సమస్య పరిష్కారం అవటంలేదు.


 ఆహార పదార్థాలకు, దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి పదార్థాలకు డిసిన్సిటైజేషన్ ప్రయత్నించవచ్చు. కాని, చల్లదనం, వేడి, వాతావరణంలో మార్పులకు సున్నితత్వాన్ని మా తం ఈ ప్రక్రియ ద్వారా ఏమి చేయలేరు. ఈ అలర్జిక్ వ్యాధులు దీర్ఘవ్యాధులు. అపుడపుడు వ్యాధి ఉద్రేకిస్తుంది. దీనిని అక్యూట్ అటాక్ అంటాము. అక్యూట్ అటాక్ తగ్గటానికి అక్యూట్ మందులు వాడినా, వెంటనే రోగ లక్షణాలు తక్కువవుతాయి. కాని రోగం నిగూఢంగా ఉంటుంది. తగిన పరిస్థితులు ఏర్పడినపుడు ఈ వ్యాధి మళ్లీ దర్శనమిస్తుంది. అలర్జిక్ వ్యాధులను సమూలంగా నయం చేయటానికి సమయం పడుతుంది. అలర్జిక్ వైనైటిస్లో 1-3 సంవత్సరాలు, ఆస్తమాలో 2 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి తీవ్రత, అక్యూట్ అటాక్స్ తరచుదనం, క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స ప్రారంభ దశలో రోగి తనకు పడని ఆహార పదార్థాలకు, వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది. చర్మానికి సంబంధించిన అలర్జిక్ వ్యాధులను పై పూతతో వ్యాధిని అణచివేయటం వల్ల రెస్పిరేటరీ అలర్జీ వచ్చే అవకాశం వుంది. ఇదీ అలర్జీక్ వ్యాధుల తీరూ… తెన్ను.


                                      ◆నిశ్శబ్ద.