సిగ్గెందుకు.. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదంపై ఉద్ధవ్ థాక్రే
posted on Apr 3, 2023 @ 10:54AM
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది.
తాజాగా ఇదే అంశంపై సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు.
అలాగే తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మన విద్యార్హతలు వెల్లడిద్దాం అంటూ ఆరంభించిన ఉద్యమానికి భారీ స్పందన వస్తోంది. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఇతరులు కూడా తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.