నిన్ను నమ్మి 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి తింగరి మాలోకం
posted on Jun 18, 2020 @ 2:12PM
ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ నిత్యం చంద్రబాబు, లోకేష్ లపై సెటైర్లు వేసే ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపేందుకు లోకేష్ తాడిపత్రి వెళ్లిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయమై ఎంపీ విజయ్ సాయి రెడ్డి లోకేష్ ను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్ లో లోకేష్ పై పంచులు వేశారు. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు. "తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టుగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం" అంటూ ట్వీట్ చేసారు.
తాజాగా దీని పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంతే ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల కోసం లోకేష్ ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు. తాడిపత్రి లో లోకేష్ తనతో పాటు తెచ్చుకున్న క్యారేజ్, అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం చేశారు. దీనిని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నారు చూడు అది మీ తింగరి మాలోకం వైఎస్ జగన్ రేంజ్ అని లోకేష్ జరిపిన తాడిపత్రి పర్యటనపై వివరణ ఇచ్చారు. "మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ శోకాలు పెట్టి, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేసాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరు పప్పే'' అంటూ మరో ట్వీట్ ద్వారా బుద్దా మండిపడ్డారు. ''43 వేల కోట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల బెయిల్ కోసం నువ్వూ, గనుల కేసులో గాలన్నయ్య జడ్జిలనే కొనాలనుకుని అడ్డంగా బుక్కైన విషయం మరిచిపోయారా విజయసాయి రెడ్డి.. తాజాగా ఒక లాయర్ కి 5 కోట్లిచ్చిన సంగటేంటి.. మీరు ఎంత పెద్ద లాయర్ కి అడ్వాన్స్ ఇచ్చినా శుక్రవారం నుండి ఉపశమనం దక్కడం లేదు పాపం'' అంటూ ఎద్దేవా చేశారు. అడ్డదారులు తొక్కి, అడ్డమైన రాతలు రాసి జగన్ ని జైలు కి పంపిన మీరు మాలోకం అనే విషయం గుర్తించకపోవడం శోచనీయం విజయసాయి రెడ్డి. నిన్ను నమ్మి క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్ కి పాల్పడి 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి తింగరి మాలోకం, గన్నేరు పప్పు అని ప్రపంచమంతా వినికిడి మీ చెవికి చేరలేదా లేక అది కూడా మీ స్కెచ్ లో భాగమేనా'' అని జగన్, విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడుతూ వెంకన్న ట్వీట్ చేశారు.