సెల్ ఫోన్ లకే నేరుగా టీవీ ప్రసారాలు!
posted on Nov 18, 2022 6:24AM
బ్యాంకు, కెమెర, కేలిక్యులేటర్, సినిమా థియేటర్ ఇలా చాలా వరకూ అన్ని అవసరాలనూ సెల్ ఫోన్ తీర్చేస్తోంది. ఇప్పటికే ఓటీటీల ద్వారా చాలా వరకూ జనం బిగ్ స్క్రీన్ జోలికి వెల్లకుండా టీవీలలోనో, మొబైల్ లోనే చూసేస్తున్నారు. అలాగే దాదాపు అన్నిటెలివిజన్ షోలనూ మొబైల్ లోనే యూట్యూబ్ ద్వారా చూసేస్తున్నారు.
ఇక ముందు అసలు టీవీ అవసరమే లేకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి త్వరలో వచ్చేయ నుంచి. టీవీ ప్రోగ్రామ్స్ కూడా నేరుగా సెల్ ఫోన్ కే ప్రసారం చేసేస్తారు. ఆ విధానం త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలో అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
ఇందు కోసం బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీలను జుగల్ బందీ చేసి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలు నేరుగా ప్రసారమయ్యేలా చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.దేశంలో 120 కోట్ల మంది సెల్ ఫోన్ వినియోగస్తున్నారు. అయితే టీవీ వీక్షకుల సంఖ్య 20 కోట్ల మంది మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్లలోనే నేరుగా టీవీ కార్యక్రమాలు వీక్షించే అవకాశం వస్తే వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.