నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
posted on Nov 18, 2022 6:45AM
నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అయితే స్టేషన్ కు సమీపంలోనే ప్రమాదం జరగడంతో వెంటనే రైల్వే అధికారులు వాటిని అదుపులోనికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
గూడూరు రైల్వే జంక్షన్ కు రైతు చేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరు జంక్షన్ కు రైలు రాగానే అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్యాంట్రీ కారులో ప్రమాద వశాత్తు మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
రైల్వో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో దాదాపు గంటకు పైగా రైలును గూడూరులోనే నిలిపివేశారు. రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.