టీటీడీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్
posted on Jun 9, 2015 @ 6:44PM
టీడీపీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెట్ ఇచ్చేందుకు.. అంతేకాక తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని.. దీనికి పాలకమండలి కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం. వీటితోపాటు పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు
* ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తెచ్చేందుకు కమిటీ
* బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం
* స్విమ్స్ ఆస్పత్రిలో అదనపు గదులు ఏర్పాటు
* వకుళమాత అతిథిగృహ నిర్మాణం
* అమెరికాలోని నాలుగు ఆలయాల్లో శ్రీనివాసకల్యాణం
* నాగలాపురంలోని వేదనారాయణ ఆలయం అభివృద్ధి
* తంబళ్లపల్లిలో 10 మెగావాట్ల సోలార్‌విద్యుత్... తిరుమలలో 7.2 మెగావాట్ల విండ్‌పవర్ ఉత్పత్తి