కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చింది భూమనే : ఓ.వి.రమణ
posted on Aug 28, 2025 @ 9:23PM
భూమన హైందవ ధర్మ పరిరక్షకుడు కాదు..టీటీడీని దోచేసిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓ.వి.రమణ విమర్శించారు. కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అని ఆరోపించారు.బిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయించారని పేర్కొన్నారు. కలెక్టర్లకు టార్గెట్ లు ఇచ్చి ఎవరిని పడితే వారిని పట్టుకొచ్చి వివాహాలు చేయించారని ఆయన తెలిపారు. వైజాగ్ లో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు 12వేలు ఖర్చు చేశారు.
ఆడిట్ రిపోర్టులో బయటపడిందని రమణ పేర్కొన్నారు.సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క కాటేజీ అయినా కట్టించావా భూమన అని ఆయన ప్రశ్నించారు. తిరుమల టీటీడీ ఛైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా..? ఆయన ప్రశ్నించారు. బుషికేష్ లో 20ఎకరాల స్థలాన్ని నొక్కేయాలని చూస్తే దాత ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వకుండా వెళ్లిపోయారని అన్నారు. వైసీపీ హయాంలో కొండపైన వ్యభిచారం జరిగిందని సాక్షాత్తు చిన్నజియ్యర్ స్వామే చెప్పారని ఆరోపించారు .
దేవుడి సొమ్ములో కమిషన్ కు కక్కుర్తి పడిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని తెలిపారు.శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం కాదని భూమన చెప్పగలడా..? అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికే క్రైస్తవుడే తెలిపారు.తాడేపల్లి, లోటస్ పాండేలలోని గోడలపై బైబిల్ సూక్తులే కనిపిస్తాయిని వెల్లడించారు. తిరుమల టీటీడీని రోడ్డుపై లాగొద్దు భూమనకు రమణ సూచించారు.