హిల్లరీ, ట్రంప్.. ఎడమొహం, పెడమొహం..
posted on Oct 20, 2016 @ 10:42AM
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్..డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ ల మధ్య ఇప్పటివరకూ రెండు డిబేట్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఇద్దరి మధ్య ఫైనల్ డిబేట్ జరిగింది అయితే గత రెండు డిబేట్లో ఇద్దురూ డిబేట్ ప్రారంభమయ్యేముందు కరచాలనంతో పలకరించుకుని డిబేట్లను ప్రారంభించారు. అయితే ఈసారి మాత్రం అలాంటి పలకరింపులు ఏం జరగలేదు ఇద్దరి మధ్య. ఎందుకంటే రెండో డిబేట్ తరువాత ఇద్దరి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరిన సంగతి విదితమే.. అందుకే డిబేట్ ముందు పలకరించుకోవడం కాదు కదా... ఒకర్ని ఒకరు అస్సలు పట్టించుకోనేలేదు. ఏదో డిబేట్ లో భాగంగా ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానం ఇచ్చినప్పుడు తప్ప ఒకరినొకరు కనీసం చూసుకోనుకూడా లేదు. ఈ డిబేట్లో జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్ గా ఫిట్ నెస్ వంటి అంశాలపై మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ ప్రశ్నలడగ్గా, హిల్లరీ, ట్రంప్ సూటిగా సమాధానం ఇచ్చారు. కాగా నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మూడో డిబేట్ అనంతరం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని చెబుతున్నాయి పలు సంస్థలు. చివరి బిగ్ డిబేట్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా.. హిల్లరీకి 92 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని, ట్రంప్ కన్నా క్లింటన్ 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని బ్లూమ్ బర్గ్ ప్రకటించింది.