రాజ్యసభ సభ్యుడిగా డీఎస్.. కవిత రికమండేషన్..!
posted on May 14, 2016 @ 1:19PM
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారా అని ఎదురుచూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో ఒక స్థానం సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ కు దక్కే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఈయన పేరు ఖరారైందని.. నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని కేసీఆర్ కూతురు కవిత డీఎస్ పేరును ప్రతిపాదించగా.. దానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి డి.శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.