టీఆర్ఎస్‌లో 11 ప్రశ్నలు!
posted on Nov 22, 2013 @ 10:10AM
రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలో చెప్పండంటూ మంత్రుల బృందం పదకొండు పనికిమాలిన ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆ పదకొండు ప్రశ్నలకు ఏ పార్టీ సమాధానాలు ఇవ్వనప్పటికీ 11 ప్రశ్నలనే కాన్సెప్ట్ మాత్రం పాపులర్ అయింది. సరే, జీవోఎం తాలూకు పదకొండు ప్రశ్నల సంగతి పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మనసులో వున్న 11 ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దాం.
1. కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించడమయితే ప్రకటించింది. ఇంతకీ తెలంగాణ వస్తుందా? రాదా?
2. ఒకవేళ తెలంగాణ నిజంగా వచ్చేస్తుంటే రాకుండా ఎలా అడ్డుకోవాలి?
3. సీమాంధ్రులని సరికొత్తగా ఎలా తిట్టాలి? ఎలా బెదిరించాలి?
4. ప్రాంతీయ విద్వేషాలని ఇంకా రెచ్చగొట్టడం ఎలా?
5. రాబోయే ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయో ఏంటో?
6. తెలంగాణ వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్టుంది. ఇప్పుడెలా?
7. ఒకవేళ టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఎలా వుంటుంది? మా ఆదాయాలకేం ఢోకా వుండదు కదా?
8. ఇతర పార్టీలలో వున్న నాయకులకి ఎలా గాలం వేయాలి?
9. మేం ఎంత ట్రై చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ మా పార్టీ ముఖం కూడా చూడటం లేదెందుకో!
10. అనవసరంగా తెలంగాణ ఉద్యమం చేశారంటూ భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మమ్మల్ని తిట్టిపోస్తారా?
11. ఫామ్‌హౌస్‌లో ఈసారి ఏయే పంటలు వేయాలి?