అర్ష్‌దీప్ పై విమర్శలు అవసరమా?
posted on Sep 6, 2022 @ 1:11PM
పొరపాట్లు జరుగుతాయి. కొన్ని పట్టించుకోనక్కర్లేదు. కొన్ని సీరియస్‌గానే పట్టించుకుంటారు. అందు లోనూ విజయానికి రెండడుగుల దూరంలో ఉన్న సమయంలో లడ్డులాంటి క్యాచ్ చేజారినపుడు. ఆది వారం పాకిస్తాన్‌తో భారత్ తలపడిన మ్యాచ్‌లో కుర్రాడు అర్ష్‌దీప్ సింగ్ బంగారంలాంటి క్యాచ్ వద లేసేడు. గోళ్లు కొరికేసుకుంటున్నంతటి ఉత్కంఠభరిత సమయలో కుర్రాడు పట్టినట్టే పట్టి వది లేశాడు. అదెలా జరిగిందీ అతనికీ అర్ధంకాలేదు.. ఆ క్షణంలో. కానీ ఎదురుగా కోపంతో రగిలిపోతూ లోపల తిట్టు కుంటూ కనిపించిన కెప్టెన్ శర్మ మొహం చూసి సింగ్ భయపడ్డాడు. ఆ తర్వాత చూస్తుండగానే కొద్ది సేపటికే పాక్ గెలిచింది. మ్యాచ్ అయిపోయింది.
అతని మీద ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అంతగా కుర్రాడిని మానసికంగా కృంగదీయ డం అవసరమా అని క్రికెట్ పండితులూ అంటున్నారు. అతను క్యాచ్ వదిలేయడం తప్పే. కానీ అంతకు ముందు భారత్ బ్యాటింగ్ చాలా ఘోరంగా సాగింది. దాన్ని గురించి ఎవ్వరూ ఇంతగా ట్రాల్ చేయకపోవ డమే విడ్డూరం. కుర్రాడిని తిట్టడం సులువు, మరి ఎంతో అనుభవం వున్న పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ చాలా దారుణంగా వెనుదిరిగారు. మరి వారి గురించి ఎవ్వరూ పల్లెత్తు కామెంట్ చేయకపోవడమే విడ్డూరం.
మ్యాచ్ 18వ ఓవర్లో రవి విష్ణోయ్ ఓవర్లో ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ కు తప్పకుండా కొంత ఊరట కలిగేది. కానీ అన్నీ అన్నిసార్లూ మనం అనుకున్నట్టే జరగదు. ఇదీ అంతే. కానీ ఆ తర్వాత నుంచి అతన్ని దూషి స్తూ చాలామంది ట్వీట్ చేశారు, చేస్తూనే ఉన్నారట! నెట్‌లో వాటిని చూస్తూ అతని తల్లిదండ్రుల మాత్రం నవ్వుకుంటున్నారట. ఎందుకంటే ఆటలో ఉండి ఆ టెన్షన్ భరిచినవాడికంటే, బయటివారు మరీ అతిగా విమర్శలు చేయడం హాస్యాస్పదమే!
మీడియా కూడా అర్షదీప్ వెంటపడింది. ఏమాత్రం ప్రశాంతంగా ఉండనీయడం లేదు. విమర్శలు ఎన్ని వస్తున్నా, వాటిని పాజిటివ్‌గానే తీసుకుంటున్నానని అతను అన్నాడు. తనకు యావత్ భారత్ జట్టూ మద్ద తుగా నిలిచి, కుర్రాడి తప్పులేదని, ఆ సమయంలో ఏదో కోపగించుకున్నామేగాని అలాంటివి అందరికీ ఎదురయిన సమస్యే అని తన బిడ్డకు మద్దతుగా నిలవడం హర్షణీయమని అర్షదీప్ తల్లి బల్జీత్ అన్నా రు. నిజానికి అతని తల్లిదండ్రులు కాస్తంత బాధపడ్డారు. అయితే అర్ష్ ఇంకా 23ఏళ్ల కుర్రాడే అంతర్జా తీయ క్రికెట్‌లోకి ఇపుడే వచ్చాడు.. అతని మీద మరీ ఇంతగా విరుచుకపడటం అర్ధం లేనిదని అతని తండ్రి దర్శన్ అన్నారు.
అయితే అంతటి కష్టంలోనూ, అర్ష్‌దీప్‌కి మద్దతుగా నిలబడి, ధైర్యం చెప్పింది మాత్రం కింగ్ కోహ్లీయే. అలాంటివి మామూలే. పెద్దగా పట్టించుకోవద్దన్నాడు. అత్యంత ఉత్కంఠభరిత టోర్నీల్లో, మ్యాచ్‌ల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నాడు. తన అనుభవం గురించి చెబుతూ, తాను ఆడిన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో తలపడిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయానన్నాడు.