రవాణా శాఖ చెక్ పోస్ట్‌ల పై ఏసీబీ రైడ్స్
posted on Oct 19, 2025 @ 12:20PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో మొత్తం ఆరు చోట్ల దాడులు నిర్వహించారు... ఈ ఆరు చెక్ పోస్ట్ లలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర మాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో ఏసీబీ అధికారులు రంగం లోకి దిగి మొత్తం ఆరు చెక్ పోస్టులపై ఒకేసారి దాడులు నిర్వహించారు.
1) మహబూబ్‌నగర్ జిల్లా లోని క్రిష్ణా చెక్ పోస్ట్.
2) సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్ చెక్ పోస్ట్.
3) కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, మద్నూర్ రెండు చెక్ పోస్ట్.
4) భద్రాద్రి కొత్తగూడం జిల్లా లోని ఆశ్వరావు పేట చెక్ పోస్ట్.
5) కొమరంభీమ్ జిల్లా లోని వాంకిడి చెక్ పోస్ట్ తో పాటు మరో చెక్ పోస్ట్ లో సోదాలు నిర్వ హించారు... మొత్తం ఆరు చెక్ పోస్ట్ ల పై దాడులు కొనసాగుతున్నాయి.
అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్, రజినీ భాయి, తిరుపతి, కిరణ్ కుమార్, ఆఫ్రోజ్ లను అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహిం చడం ఇది రెండవ సారి.... కావడంతో తీవ్ర సంచలనం రేపుతుంది. నిన్న అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు.