రోగికి పంది నుండి తీసిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం
posted on Nov 2, 2021 @ 2:30PM
అవయవాల ను ట్రాన్స్ ప్లాంట్ చేయడం వై ద్యరంగానికి కొత్త కాదు. అలాగే దాతల నుండి తీసిన కిడ్నీ,లివర్,వంటివి ఇంప్లాంట్ లోను వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. అయితే ఒక జంతువు నుండి తీసిన కిడ్నీ అమర్చడం లో విజయం సాధించారు వైద్యులు. ఏ అవయవ మైనా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే శరీరానికి ఫారన్ బోడీగా భావిస్తుంది కొన్ని సందర్భాలలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన అవయవం స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ఓ రోగికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వస్తే ఆరోగికి పందినుండి తీసిన కిడ్నీ ని అమర్చడం లో వైద్యులు విజయం సాధించారు అయితే కిడ్నీ అమర్చిన తరువాత దానిని శరీరం రిజెక్ట్ చేయలేదని వైద్యులు తెలిపారు.
జంతువుల నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం లో సాధించిన ప్రగతి ఒక కీలక మలుపుగా పేర్కొన్నారు వైద్యులు. మానవ శరీరం లో మనిషిది కాని మరో అవయవాన్ని పంది నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం తొలి సారి కావాదం విశేషం. డాక్టర్ ఈఓ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు. జనటిక్ గా ఇంజనీరింగ్ చేయబడ్డ కిడ్నీ ని రోగి వెంటిలెటర్ పై ఉంచి అమార్చడం మరో విశేషం. అయితే పంది కిడ్నీ కావడం సహజంగా రీ యాక్షన్ ఉంటుందని అభిప్రాయ పడ్డారు.
ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యుట్ కు చెందిన డాక్టర్ నీ యు లొంగ్ ఆన్ సర్జన్ డిపార్టుమెంటు ఆఫ్ సర్జరీ రాబర్ట్ మోంట్ గో మేరీ ఎం డి లియాన్ వీచార్ నేతృత్వం లోని వైద్య బృందం రెండు గంటల పాటు సాగింది. ప్లాంటేషన్ చేస్తున్నంత సేపు నిశితంగా పరిశీలించారు. పరిశోదనలో సైతం ఏ రకమైన రీ యాక్షన్ రాక పోవడం తో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్ ప్లాంటేష న్స్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సి డి సి వివరాల ప్రకారం దాదాపు 75.౦౦౦ మంది ప్రజల కు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా 8,౦౦౦ మంది రోగులకు మాత్రమే అవయవ దానం చేసేవాళ్ళు అందుబాటులో ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు.ప్రతి తొమ్మిది నిమిషాలకు ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని జేనిటిక్స్ ను మార్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు అభిఇప్రాయ పడుతున్నారు. ఈ శస్త్ర చికిత్స విజయవంత మైతే ఇక అవయవాల మార్పిడి తో మరింత మందికి ప్రాణం పోయవచ్చని ఆశిద్దాం.
.