జగన్ సీఎం పోస్టు ఇంకా 6 నెలలే!
posted on Apr 4, 2021 @ 1:28PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రాజకీయ కాక రేపుతోంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై.. ఆయన కుమార్తె సునితా రెడ్డి ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. జగన్ మీద కోపాన్ని ఆయన సోదరి షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారని అన్నారు. ఆరు నెలల తర్వాత సీఎం జగన్ అధికారంలో ఉండరని తెలిపారు. ప్రలోభాలు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు మళ్లీ ఆదరణ వస్తుందన్నారు చింతా మోహన్.
ధర్మయుద్ధంలో సీఎం జగన్ గెలవలేరని చింతా మోహన్ అన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే ఈసారి బీజేపీకి కూడా పడుతుందని జోస్యం చెప్పారు. అధిక ధరలు బీజేపీ పతనానికి కారణమవుతుందని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న ప్రచారంతో బీజేపీకి ప్రయోజనమేమీ ఉండదని, అదంతా వృథా ప్రయాస అన్నారు చింతా మోహన్.