తిరుపతి వెంకన్న వెండికి ఇ టెండర్
posted on Jul 21, 2012 @ 10:05AM
తిరుమల వెంకన్నకు చెందిన వెండిని మార్చి బంగారం కొనాలని తిరుమలతిరుపతి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అసలు ఈ వెండి భక్తులు సమర్పించిందా లేక హుండీదా అని పాలకమండలి తెలుపలేదు. దేశం మొత్తం మీద అధిక సంపన్నుడిగా పేరు గాంచిన వడ్డీకాసులవాడి ఆస్తులు లక్షన్నర కోట్ల పై మాటే. వెండి విలువ దాదాపు 16 వేలకోట్ల రూపాయలు. స్వామి వారి దగ్గరున్న క్యాష్ వెయ్యికోట్లు .ఇదంతా జాతీయ బ్యాంకుల్లో భద్రంగా వుందని స్వామివారి పాలక మండలి చెబుతుంది. ఇప్పటికే వెంకటేశ్వర స్వామికి 50వేల కోట్లరూపాయల ఆభరాణాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం స్వామివారికి ఉన్న వెండిని కొంత కరిగించి దానితో బంగారాన్ని కొని బ్యాంకులో భద్రపరచాలని దేవస్ధానం నిర్ణయించింది. ఈ వెండిని హైదరాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌కి తరలించి కరిగిస్తారని దానికి గాను ఇ టెండర్లను పిలవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
తరలించిన వెండిలో 20 శాతం తరుగు, రవాణా ఖర్చులకు పోతుందని దేవస్ధానం వారు తెలిపారు. అంతకు ముందుకూడా కరిగించిన వెండినితోనూ, బంగారంతోనూ డాలర్లు చేయించి భక్తులకు ఇచ్చేవారు. అయితే డాలర్లలో కొన్ని శేషాద్రి మాయంచేశాడని ఆరోపణలు ఉన్నా ఆయన తన పదవిని ప్రతి రెండేళ్లకు ఒకసారి పొడిగించుకుంటునే ఉన్నారు. వెంకటేశ్వరస్వామికి మరో ఆదాయం తలనీలాలు ప్రస్తుతానికి 500 టన్నుల ఉన్నట్లు అంచనా దీని విలువ కోట్లలో ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. అయితే ఇవన్నీ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయా లేదా ఉంటే వాటికి భద్రత ఎంతవరకు గ్యారెంటీ ఉంటుందనేది మరొక ప్రశ్న..అలాగే స్వామివారి ఆస్తులను, కార్యకలాపాలన్నిటిని అనుమానాలకు తావివ్వకుండా పారదర్మకత ప్రదర్శించాలని భక్తులు కోరుతున్నారు.