కోస్తాంద్రరాయలసీమలో కూల్, తెలంగాణాలో హాట్
posted on Jul 21, 2012 @ 10:30AM
రాష్ట్రంలో ఎండలు తగ్గాయి. వాతావరణం చల్లబడిరది. వర్షాలు పడుతున్నాయి. కోస్తాంద్రలో పొలిటికల్ గా కూడా అదే వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా అసెంబ్లీ హాలులో కలసినప్పుడు మామూలుగానే మాట్లాడుకున్నారు. కుశల ప్రశ్నలు కులాసా కబుర్లతో వాతావరణాన్ని శాంత పరిచారు. మీడియావారికి గ్రూప్ ఫొటోలు ఇచ్చారు. ఇప్పుడు మాటల యుద్దాలు ఆగిపోయాయి.
ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేనేత కార్మికుల కోసం తలపెట్టిన ధర్నాను టిఆర్‌యస్ పార్టీ అడ్డుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతుంది. కొండసురేఖ తెలంగాణా ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నేపధ్యంలో జగన్ పార్టీకి తెలంగాణాలో బలపడే చాన్సు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుందని తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణాలో వైయస్‌ఆర్ పార్టీ బలపడితే టిఆర్‌యస్‌కు ఎదురుదెబ్బ పడుతుందని భయపడుతుంది.
అందుకే తెలంగాణ మీద వైసిపి ప్రకటన చేసేవరకు తెలంగాణలో అడుగుపెట్టనీయమని కెటిఆర్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలంగాణ ప్రకటన వస్తుందని తనకు స్పష్టమైన సంకేతం అందిందని చెప్పుకొచ్చి ఆతరువాత ప్రణబ్ తమకు హామీ ఇవ్వనందువల్లే రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించామని చెబుతుండటం తెలిసిందే. ఈ అయోమయం, గందరగోళం మద్య వైసిపి ఎక్కడ బలపడుతుందోనని ఆ పార్టీశ్రేణులు వైసిపిని నిలువురిస్తున్నాయి. దీనివల్ల కోస్తాంద్రరాయలసీమల్లో వైసిపి కూల్‌గా ఉందను కుంటే తెలంగాణలో రాజకీయాలు హాట్‌గా ఉంటుంన్నాయని భావించాల్సివస్తుంది.