ఇన్ని డెంగ్యూ కేసులు చరిత్రలో ఎన్నడూ నమోదుకాలేదు.. అచ్చెన్నాయుడు
posted on Sep 20, 2022 @ 12:35PM
ప్రజారోగ్యం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందే గాని వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మంగళవారంనాడు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం పై టీడీపీ అభ్యర్ధులు విరుచుకు పడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి సభకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు పేర్కొన్నారు. మంత్రి గారు పట్టణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగాల గురించి తెలుసా?’ అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం నమోదు అయినన్ని డెంగ్యూ కేసులు చరిత్రలో ఎప్పుడూ నమోదు కాలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
డెంగ్యూ వ్యాధి వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని.. లోకల్‌గా వైద్యం చేయించుకున్నాక పరిస్థితి విష మించి చాలా మంది చనిపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా ల్యాబ్‌లు పనిచేయడం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో చూపించుకోవాలని అంటున్నారని వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పాత బకాయిలు ఇవ్వలేదని వారు వైద్యం చేయడం లేదన్నారు. పేదలకు డెం గ్యూ వస్తే ప్లేట్ లెట్స్ పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
విషజ్వరాలు ముఖ్యంగా డెంగ్యూవల్ల ప్రజలు చనిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. విషజ్వరాలపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం పై ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చెత్తపన్ను వేస్తున్నారేగాని, చెత్త తీసుకువెళ్లడం లేదన్నారు. ఆరోగ్యశ్రీలో విషజ్వరాలు చేర్చమనడం అన్యాయమని, అది వెంటిలేటర్ మీదకు వెళితేనే వర్తిస్తుందని అనడం దారుణమని ఆయన ఆగ్రహిచారు. ప్లేట్ లెట్స్ దోరక్కపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నా రని నిమ్మల రామానా యుడు పేర్కొన్నారు. చింతూరు లో సంధ్య అనే అమ్మాయి స్థానికంగా వైద్యం అందక భద్రాచలం లో చనిపో యిందని ఉదాహరణగా పేర్కొన్నారు.