ఇండియా కూటమి మూడో భేటీ ముంబైలో?
posted on Jul 31, 2023 7:37AM
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో, అధికారం నిలుపుకునేందుకు, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి కొత్త మిత్రులను చేర్చుకునే ప్ర్యతాన్ చేస్తుంటే, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఒకటైన ఐఎన్డీఐఎ (ఇండియ)కూటమి, అధికార ఎన్డీ కూటమిని ఎదుర్కునేందుకు వరస సమావేశాలతో ఐక్యతను చాటుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.
ఓ వంక మణిపుర్ హింస పై పార్లమెంట్ లో మోదీ ప్రభుతానికి వ్యత్గిరేకంగా, అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించిన ఐఎన్డీఐఎ కూటమి మరోవంక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పోరాటాలకు సిద్దమవుతోంది. అలాగే, ఇప్పటికే... పాట్న, బెంగుళూరులలో రెండు సార్లు సమావేశమైన విపక్ష కూటమి తదుపరి మూడవ సమావేశం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 24-25 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. జూలై 18న 26 పార్టీలు హాజరైన జూలై 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో కూటమి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సహా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల గాంధీతో పాటుగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ హాజరుకావడం బెంగుళూరు సమావేసానికి హైలైట్‌గా నిలిచింది.
ముంబైలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో కో-ఆర్డినేషన్ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర ప్యానల్‌్ఫను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
కాగా, ముంబై సమావేశంలో 11 మంది సభ్యులతో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి అధ్యక్షుడు, కన్వీనర్‌ను కూడా ముంబై సమావేశంలో ఎంచుకుంటారు. కాగా, కూటమి అధ్యక్ష పదవికి అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అంతిమంగా సోనియా గాంధీ నాయకత్వంపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని అంటున్నారు.