సరదా తీర్చిన సరదా ఆలోచన!
posted on Aug 30, 2022 @ 1:11PM
వాళ్లిద్దరికీ సరదాగా ఓ రెండు రోజులు వేరే నగరంలో గడపాలని సరదా. చాలా కాలం తర్వాత వీలు కుది రింది. ఏదో రకంగా సరదా చేసుకున్నారు. మంచి హోటల్ రూమ్ తీసుకుని రెండు వారాలు గడిపారు. తిన్నారు, తిరిగారు, సముద్రం మీద బోటు షికార్లు చేశారు.. అంతా అయి ఇంటికి తిరిగి వచ్చా రు. చాలా గొప్ప పని ముగించుకున్నట్టు. పాపం వారి సతీమణులు సేవలు చేసి తరించారు. వారిద్దరూ లోలోపల ఆ ఆనందాన్ని తల్చుకుంటూ చాలారోజులే ఆనందించారు. వారి సతీమణులకు తెలిసిందా లేదా అన్నది తర్వాతి సంగతి అలా కూడా కొందరు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరి విష యంలోనే సీన్ అంతగా సినిమాటిక్‌గా పండదు.. పోలీసులూ ఎంటరయి చుక్కలు చూపుతారు!
పేర్లెందుకు గాని, ఇద్దరు వ్యాపారులు తమ వ్యాపార పనుల నిమిత్తం బెంగుళూరు వెళుతున్నామని చెప్పి బయలుదేరారు. అమాయకపు సతీమణులు అవుననే అనుకున్నారు. అన్నీ సర్దిమరీ పంపారు. ఈ మహా ను భావులు సినిమాటిక్‌గా వారి సరదాల కోసం ఏకంగా బ్యాంకాక్ వెళ్లారు! అక్కడంతా సరదాగా గడిపేరు. ఆ సమయంలో అన్నీ మర్చిపోయారు. బిజినెస్ లేదూ వంకాయలేదు.. సరదాగా కుర్రాళ్లయి పోదామని ఇద్దరూ గడిపారు. బ్రహ్మాండంగా అంతా గడిచింది. తీపి జ్ఞాపకాలతో వారు పట్టణానికి చేరుకున్నారు. వారి సతీ మణులు పాపం భర్తలు ఎంతో కష్టపడి ఇంటికోసం, బిజినెస్‌కోసం పెద్ద టూర్ వెళ్లి వచ్చారని సేవలు చేశారు. సరదాగా వివరాలూ అడిగే ఉంటారు.. వీరు చక్కగా అబద్దాలే చెప్పి ఉంటారు. ఇదంతా మామూలే.
ట్విస్ట్ ఏమిటంటే వాళ్లు వచ్చిన మర్నాడు ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చారు. వాళ్లు చుట్టపు చూపు గా ఏమీ రాలేదు. అసలు సంగతి ఆ కళాపోషకుల సతీమణులకు చెప్పి ఇద్దర్నీ క్వారంటైన్‌కి పంపమని హెచ్చరించారు. అంతేకాదు అలాగని ఆ హెచ్చరికను రిపోర్టు రూపంలో ఇళ్ల గేటుకి అంటించి మరీ వెళ్లా రు. ఇక మనవారి పరిస్థితి మీరే ఊహించుకోవచ్చు!