Read more!

పోరాటం ఎంత పెద్దదైతే.. విజయం అంత పెద్దగా ఉంటుందని చెప్పిన ధీరోదాత్తుడు..!

స్వామి వివేకానంద  జనవరి 12వ తేదీన జన్మించారు. ప్రతి సంవత్సరం వివేకానందుని  జయంతినే జాతీయ యువజన దినోత్సవంగా కూడా  జరుపుకుంటారు. భారతదేశాన్ని, భారతదేశంలో ఆధ్యాత్మికతను, హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు ఆయన. భారతదేశ యువతను ఉత్తేజపరితే ఉవ్వెత్తు తరంగం ఆయన ఉపన్యాసాలు. ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ యువతకు వివేకానందుని వాక్యాలు, ఆయన జీవితం గొప్ప స్పూర్తిగా నిలుస్తోంది.

 స్వామి వివేకానంద  1863 జనవరి 12న కోల్‌కతాలో జన్మించారు. ఈయన తండ్రి కలకత్తా హైకోర్టులో న్యాయవాది. ఈయన తల్లి మతపరమైన అభిప్రాయాలు కలిగిన మహిళ. వివేకానందుని  చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్. నరేంద్రనాథ్ చాలా చిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించారు.  ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించిన తరువాత,  స్వామి వివేకానంద అని పిలువబడ్డాడు.

స్వామి వివేకానంద యువతకు సరైన మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో విజయ సూత్రాలను  అందించారు. భారతదేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. దేశ భవిష్యత్తు వారి భుజాలపై ఉంది. ఈ విషయాన్ని తన కాలానికే గమనించి దేశ భవిష్యత్తు యువత భుజాలమీదే ఉందని, యువత కొత్త శక్తిలా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే  ఇప్పటికీ  ఎంతోమంది యువత తమ జీవితంలో  ఆయన నుండి ప్రేరణ పొందుతూ ఉన్నారు.  చికాగోలో ప్రపంచ మతాల సభలో స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం యావత్ ప్రపంచం భారతదేశం వైపు దృష్టిసారించేలా చేసింది.

స్వామి వివేకానంద 1897లో  రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. కర్మ యోగం, గురు బోధన మొదలైనవి దీని ఆదర్శాలు.  1863లో జన్మించిన స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాల వయసులో మరణించారు. ఈయన మరణం సంభవించినప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్నారు. ధ్యానం, ఆధ్యాత్మికతను ఈయన ఎంతగానో ప్రోత్సహించారు.

స్వామి వివేకానంద దేశానికి రగిలించిన స్పూర్తి ఆయన దేశ గొప్పదానాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన తీరుకు  1984లో  భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవమైన జనవరి 12ను యవజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి.

                                               *నిశ్శబ్ద.