Read more!

మాస్కోలో ఉగ్రదాడి.. 70 మంది మృతి

రష్యాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 70 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది.  

మాస్కో  శివారులోని క్రాస్నోగోర్స్క్‌లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు బాంబులుతో విరుచుకుపడ్డారు. అనంతరం కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో  కనీసం 70 మంది మృత్యువాతపడినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మరో 100 మందికిపైగా గాయపడ్డారని సమాచారం.

కాగా ఉగ్రవాదులు భద్రతా బలగాల యూనిఫారం ధరించి కన్సర్ట్ హాలులోకి ప్రవేశించి ఈ దారుణానికి తెగబడ్డారని తెలుస్తోంది.  హాలులోకి ప్రవేశిస్తూనే గ్రనేడ్లు విసిరి కాల్పులు జరిపారని,  కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని దర్యాప్తులో తే లింది.  సంఘటన సమాచారం అందగానే ఆ ప్రాంతానికి చేరిన  భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ప్రతిగా ఉగ్రవాదులూ ఎదురు కాల్పులు జరిపారు.  

ఇలా ఉండగా దాడికి బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) ఒక ప్రకటన విడుదల చచేసింది.  రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జగరడం గమనార్హం. షో స్టార్ట్‌ అవుతుండగా మిలటరీ దుస్తుల్లో చొరబడ్డ టెర్రరిస్టులు