ప్రపంచ రికార్డు కోసం భయానక సాహసం!
posted on Sep 30, 2022 @ 2:04PM
ఒకమ్మాయి తాడు మీద నడుస్తుంటుంది, ఒకడు డప్పు కొడుతూ ఆమెను ఉత్సాహపరుస్తుంటాడు, ఒక పిల్లాడు బొచ్చ పట్టుకుని డబ్బులు అడుగుతూంటాడు. ఇది సాధారణంగా అనాదిగా రోడ్డుమీదా, ఇళ్ల దగ్గరో అంద రం చూసే గొప్ప సాహసం! దీనికే మావా,,ఆ పిల్లగాని కిందపడితే ఏమన్నా ఉందా! అని తెగ ఆశర్యపోతూ కామెంట్లు చేస్తుంటారు. సర్కస్‌లో గోళ్లు, కోపంలేని పులితో ఒక బక్కపలచని వ్యక్తి ఆడుతూంటాడు. అప్పుడూ అందరి ఎక్స్‌ప్రెషన్ ఒకటే. కానీ రాఫెల్, అలెగ్జాండర్ చేసిన సాహసం చూస్తే, వింటే గుండాగినంత పనే అవుతుంది.
వాళ్లిద్దరూ మనకు తెలిసిన ఫీట్లకు మించి భయానక ఫీట్ చేశారు. ప్రపంచ రికార్డు సాధించాలన్న తపన తో వారిద్దరూ పసిఫిక్ మహాసముద్ర నైరుతి దిశలోని తాన్నా దీవుల్లో నిప్పు నదులు వస్తున్న యాసర్ పర్వతం పైన 137 అడుగుల ఎత్తున ఒక చివరి నుంచి మరో చివరికి తాడులాంటిది కట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడిచారు! కింద ప్రాణం తీసే నిప్పుల నది. ఏమాత్రం పట్టుదప్పినా మనిషి మిగలడు. నిప్పుగుండం మింగేస్తుంది. అలాంటి సాహసం చేయడానికి వారు ఎంతగా సాహసించారన్న ది ఆలోచి స్తే నే ఒణుకుపుడుతుంది.
వారి ఫీట్‌ని వీడియో తీసిన వ్యక్తి భయంతో ఒణికిపోయాట్ట. వాళ్లిద్దరూ తలకు హెల్మెట్‌తో పాటు గ్యాస్ మాస్క్ పెట్టు కున్నారు. మధ్య మధ్యలో తీసి మళ్లీ ధరించారు. కింద నిప్పుల గుండం నుంచి వచ్చే వేడి సెగతో ఊపిరాడని పరిస్థితి. అయినా అంతటి కఠిన పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ తప్పకుండా తాడులాంటి దాని మీద నడవడానికి సాహసించారు. అసలు వాల్కనోని చూస్తేనే భయమేస్తుంది. పైగా దాని పైన నడక అంటే ప్రాణంపోయినంత పనే. ఏ క్షణాన ఏం చూడాల్సివస్తుందో అని ప్రేక్షకులు కొందరు చాలా మంది కళ్లు మూసుకున్నారు. వెనుక నిప్పు కణికలు పేలుతూంటే అవి మీద పడి ఎక్కడ పడిపోతానేమో నని భయపడిచచ్చాననుకోండి అన్నాడు రాఫల్.